ఫోకస్

కఠినంగా వ్యవహరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో అనేక దేశాలకు ఇస్లామిక్ ఉగ్రవాద ప్రమాదం పొంచి ఉంది. విద్యార్థి దశ నుంచే ఉగ్రవాదాన్ని నూరిపోస్తున్నారు. ప్రభుత్వం దీనిపై దృష్టిసారించాలి, లేకపోతే మరింత ప్రమాదంలో పడిపోతాం. ఉగ్రవాదానికి పుట్టినిల్లు అయిన సిరియా, లెబనాన్ వంటి దేశాలవారికి ప్రపంచంలో ఏ దేశం ఆశ్రయం కల్పించలేదు. ఆశ్రయం కల్పించిన జర్మనీ లాంటి దేశాల్లో సైతం వీరు ఉగ్రదాడులకు పాల్పడుతున్నారు. విద్యా సంస్థల్లో ఏం బోధిస్తున్నారో ప్రభుత్వం నిఘా పెట్టాలి. మదర్సాల్లో ఏం చెబుతున్నారు, చర్చిలు, ఆలయాల్లో దేశ భక్తిని బోధిస్తున్నారా? ఉగ్రవాదాన్ని నేర్పిస్తున్నారా? అని చూడాలి. తనను తాను రక్షించుకోవడానికి ఉగ్రవాదానికి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరిపై నిఘా పెట్టడం అవసరం. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికాలోని జపాన్‌వారిపై ఇదే విధంగా ఆంక్షలు విధించారు. అమెరికా జపాన్‌ల మధ్య యుద్ధం జరుగుతోంది, మిమ్ములను ఏమీ అనం అయితే మీకు ప్రత్యేకంగా కేటాయించిన ప్రాంతాల్లో ఉండి పని చేసుకోవాలి, మీ పనిపై నిఘా ఉంటుందని అమెరికా చెప్పి మరీ చేసింది. అన్నింటికన్నా దేశ భద్రత ముఖ్యం. జామీయా ఇస్లామియా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ లాంటివి ఉగ్రవాదాన్ని పెంచి పోషించే కేంద్రాలుగా మారాయి. అక్కడ జరిగే కార్యకలాపాలను ప్రభుత్వం పరిశీలించాలి. ఉగ్రవాద దేశాల నుంచి హైదరాబాద్‌కు నిధులు వస్తున్నట్టు, వాటిని ఉగ్రవాద కార్యకలాపాల కోసం వినియోగిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. నేషనల్ ఇనె్వస్టిగేషన్ ఏజెన్సీ సమర్ధవంతంగా పని చేస్తోంది. గతంలో కూడా ఇదే విధంగా పని చేసినా అధికారంలో ఉన్న వాళ్లు పూర్తి స్వేచ్ఛను ఇవ్వలేదు. ఇప్పుడు ఉగ్రవాదాన్ని ఏరిపారేయాలనే దృడ సంకల్పంతో పాలకులు ఇనె్వస్టిగేషన్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్యకలాపాలపై వీరే నిఘా పెట్టి పెద్ద ప్రమాదాన్ని తప్పించారు. నాయక్ అనే వ్యక్తి ఉగ్రవాదం పట్ల యువత ఆకర్శితులు అయ్యే విధంగా ప్రసంగాలు చేస్తున్నారు. ఇతని ప్రసంగాలను నిషేధించాలని యువతను తప్పు దోవ పట్టించే విధంగా ఉంటున్నాయని, ముస్లింలలోని షియా తెగ వారు డిమాండ్ చేశారు. కొన్ని పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలకోసం ఇలాంటి వారిని ప్రోత్సహిస్తున్నాయి. ఉగ్రవాదాన్ని నివారించేందుకు అంతా ఏకం కావాలి. పార్టీల కన్నా దేశం ముఖ్యం అని గ్రహించాలి.

- త్రిపురనేని హనుమాన్ చౌదరి ప్రజ్ఞ్భారతి