ఫోకస్

ఇదో అంతర్జాతీయ సమస్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉగ్రవాదం, తీవ్రవాదాలకు మతం, ప్రాంతం, దేశం అనేవి ఉండవు. సమాజంలో పెడత్రోవపట్టిన యువత ఉగ్రవాదానికి రకరకాల కారణాలతో ఆకర్షితులవుతుంటారు. ఉగ్రవాదం నిర్మూలనకు తెలంగాణ పోలీసు అప్రమత్తంగా ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేయడంలో తెలంగాణ పోలీసు, గ్రేహౌండ్స్ పోలీసులు అగ్రమార్గాన ఉన్నారు. అలాగే ఇటీవల మన రాష్ట్ర పోలీసులు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉగ్రవాద జాడలను పసిగట్టి వారిని అరెస్టు చేశారు. ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు ప్రజల సహకారం ఉండాలి. కేవలం అది పోలీసుల పనిగా భావించరాదు. ఉగ్రవాద అనుమానితుల కదలికలు ఎక్కడున్నా పోలీసులకు సమాచారం అందించాలి. ఉగ్రవాదం ఒక రాష్ట్రం లేదా ఒక ప్రాంత సమస్య కాదు. ఇది మొత్తం అంతర్జాతీయ సమస్య. ఉగ్రవాద సంస్థల దాడులకు జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా, టర్కీ, ఇంగ్లాండ్ దేశాలు బలవుతున్నాయి. భారత్‌లోకూడా ఉగ్రవాదం పంజా విప్పింది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదం సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలి. దీనికోసం సమాచార టెక్నాలజీ వ్యవస్థను వినియోగించుకోవాలి. ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంగా పనిచేస్తున్నాయి. ఉగ్రవాదానికి ఆకర్షితులవుతున్న యువతను గుర్తించి వారిని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, బంధువులు, ఉపాధ్యాయులది. ఎందుకంటే తొలుత యువత దారితప్పుతున్న విషయం వారికి తెలుస్తుంది. దీనివల్ల తమ పిల్లల జీవితం నిర్వీర్యమవుతుందనే విషయం గుర్తించాలి. యువతకు సరైన కౌనె్సలింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. చిన్నప్పటి నుంచి పిల్లల్లో దేశభక్తిని ప్రేరేపించాలి. వారిని సన్మార్గంలో పెట్టేందుకు అన్ని చర్యలు తీసుకోవాలి. పెడత్రోవబట్టిన ప్రతి యువకుడు ఉగ్రవాదంవైపు ఆకర్షితులుకారు. అనేకరకాల ప్రలోభాలు లేదా మతపరమైన ఉన్మాదానికి గురై యువత ఉగ్రవాద సంస్థల్లో చేరుతుంటారు. హైదరాబాద్‌లో సంఘ విద్రోహశక్తులను పట్టుకునేందుకు నాకాబందీ, ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నాం. కొంత మంది యువకులు ఫేస్‌బుక్, ఇంటర్నెట్ సదుపాయాలను దుర్వినియోగం చేస్తున్నారు. ఎక్కడైతే శాంతిభద్రతలు నియంత్రణలో ఉంటాయో అక్కడ అభివృద్ధి ఉంటుంది. మన రాష్ట్రంలో ఉగ్రవాద శక్తుల కార్యకలాపాలను నిరోధించేందుకు పోలీసులు నిరంతరం అప్రమత్తతతో విధులు నిర్వహిస్తున్నారు. శాంతిభద్రతల విషయంలోరాజీలేదు.

- మహేందర్ రెడ్డి హైదరాబాద్ పోలీసు కమిషనర్