ఫోకస్

ఉగ్రవాదాన్ని అణచేదెలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉగ్రవాదానికి ఎల్లలు లేవు. ఈ రోజు న్యూయార్కు నుంచి హైదరాబాద్ వరకు ప్రపంచ మంతా విస్తరించిన ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు అన్ని దేశాల్లోని ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నా కొత్త పద్ధతుల్లో ఉగ్రవాదం కోరలు చాపుతోంది. హైదరాబాద్‌లో ఇటీవల ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదానికి ఆకర్షితులై విధ్వంసానికి కుట్రపన్నిన ఏడుగురిని నేషనల్ ఇనె్వస్టిగేషన్ ఏజన్సీ (ఎన్‌ఐఏ) పోలీసులు అరెస్టు చేయడంతో మరోసారి హైదరాబాద్ పేరు మార్మోగింది. తీగలాగితే డొంకంతా కదలినట్లు ఈ ఉగ్రవాద అనుమానితులకు మహారాష్ట్ర నాందేడ్‌తో కూడా లింక్ ఉన్నట్లు ఎన్‌ఐఏ పేర్కొంది. ఇటీవల కాలంలో జర్మనీ, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, బ్రెజిల్, అమెరికా దేశాల్లో ఉగ్రవాదం పంజా విప్పింది. మనదేశంలో ముంబాయి, అహ్మదాబాద్, బెంగళూరు, వారణాసి, జైపూర్, అజ్మీర్, మాలేగావ్ తదితర నగరాల్లో ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడి విధ్వంసం సృష్టించారు. 2008 నవంబర్ 26వ తేదీన ముంబాయి పేలుళ్ల ఘటన దేశానికి కుదిపేసింది. పొరుగుదేశం నుంచి ఉగ్రవాద ముష్కరులు పడవలపై అరేబియా సముద్రంపై ముంబాయికి వచ్చి హోటల్‌పై దాడిచేసి మారణహోమం సృష్టించారు. ఉగ్రవాద సంస్థల సానుభూతిపరులు ఆధునిక టెక్నాలజీని విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తున్నారు. మెమోరీస్ ఆఫ్ ముజాహిదీన్, బగ్ న్యూస్, ఖలిఫాత్ సైబర్ ఆర్మీ తదితర పేర్లతో మొబైల్ యాప్స్‌ను సృష్టించి టెలిగ్రాంలద్వారా ఉగ్రవాద సమాచారాన్ని పంచుకుంటున్నారు. వీటిని అనంతరం డిలిట్ చేస్తున్నారు. వాట్సప్‌ల ద్వారా సమాచారాన్ని పంచుకుంటే పోలీసు కళ్లలో పడుతామనే ఉద్దేశ్యంతో వీరు సైబర్ అనాలిసిస్‌లకు ఒక పట్టాన దొరకని యాప్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్‌లో పోలీసులు అరెస్టు చేసిన ఉగ్రవాద అనుమానితులు టెలిగ్రాం విధానాన్ని ఉపయోగించుకుంటున్నట్లు ఎన్‌ఐఏ దర్యాప్తులో బహిర్గతమైంది. యాప్, టెలిగ్రాం చానళ్లను ఇటీవల కాలంలో ఉగ్రవాద సానుభూతిపరులు వినియోగించుకుంటూ దేశ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఉగ్రవాదం నెట్‌వర్క్‌ను విచ్ఛిన్నం చేసేందుకు దేశంలో నిఘా విభాగాన్ని పటిష్టం చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పోలీసు శాఖల మధ్య సమన్వయం ఉండాలి. పార్టీలకు అతీతంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న వివిధ రాజకీయ పార్టీల ప్రభుత్వాలు ఉగ్రవాదం నిర్మూలనకు సహకరించాలి. ఉగ్రవాద అనుమానితులను పోలీసులు అరెస్టు చేస్తే వారి నైతికత దెబ్బతినే ప్రకటనలు రాజకీయ పార్టీలు చేయడం మానుకోవాలి. ఉగ్రవాద నేరాలకు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితుల కేసులను సత్వరమే విచారించేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలి. 1990 దశకంలో ముంబాయితోపాటు వివిధ నగరాల్లో జరిగిన ఘటనలపై ఇంకా కేసులు విచారణలో ఉన్నాయి. ప్రత్యేక కోర్టులు ఇచ్చిన తీర్పులను పై కోర్టులో సవాలు చేయడం, ఏళ్ల తరబడి కోర్టులు కేసుల పెండింగ్ భారంవల్ల సత్వరమే తీర్పులు ఇవ్వని స్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో సైబర్ టెక్నాలజీని వినియోగించుకుని విజృంభిస్తున్న ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు, ఉగ్రవాదం మూలాలు, అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.