ఫోకస్

ప్యాకేజీలతోనే ప్రయోజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హోదా అంశాన్ని రాజకీయ పార్టీలు తమ స్వప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోతే తీవ్ర నష్టం జరిగిపోతుందని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో బిజెపియేతర పార్టీలన్నీ కృతకృత్యులయ్యాయి. రాజకీయ లబ్ధి కోసం పార్టీలు ఆడుతున్న నాటకం ఇది. ప్రత్యేక హోదాకన్నా ప్రత్యేక ప్యాకేజీ వల్ల రాష్ట్రానికి లాభం ఇంకా ఎక్కువ చేకూరుతుందనే విషయం ప్రజలు గ్రహించాలి. ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తోందని, బిజెపి ఈ విషయంలో మాటతప్పిందని అన్ని పార్టీల నేతలు చెపుతున్నారు. ఇది ఒకరకంగా బిజెపిని బద్నాం చేయడానికి అన్ని పార్టీలూ కలిసి పన్నుతున్న కుట్ర. 14వ ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన సిఫార్సులను పార్లమెంట్‌లో అన్ని పార్టీలు ఆమోదించాయి. నెట్ కలెక్షన్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ టాక్స్‌లో గతంలో రాష్ట్రాలకు 32 శాతాన్ని కేంద్రం ఇచ్చేది. 14వ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల ప్రకారం దీన్ని 42 శాతానికి పెంచింది. అందువల్ల ఏ రాష్ట్రానికీ ఇకపై ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులలో పేర్కొంది. అప్పుడు అన్ని రాజకీయ పార్టీలూ తలూపాయి. ఇప్పుడు పార్లమెంట్‌లో మళ్లీ హోదా కావాలని ఆయా పార్టీలు కోరడం అర్థరహితం. ప్రత్యేక హోదా కావాలని జార్ఖండ్, చత్తీస్‌గఢ్, ఒడిశా, రాజస్థాన్, బీహార్ అడుగుతున్నాయి. వారికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వాల్సి వస్తే కేంద్రం ఏవిధంగా మనుగడ సాగిస్తుంది? దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మేం ప్రయత్నిస్తున్నా బిజేపీయేతర పార్టీలు వారి ఆలోచనలను పూర్తిగా మార్చేసినందున సాధ్యం కావడం లేదు.

- విష్ణుకుమార్ రాజు విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే