ఫోకస్

ప్రత్యేక హోదా సాధ్యం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తే మాకేమీ అభ్యంతరం లేదు. అయితే ఆంధ్రప్రదేశ్‌కు హోదా కల్పించే అవకాశం ఎంత మాత్రం లేదు. విభజన చట్టంలో రెండు రాష్ట్రాలకు ఇచ్చిన హామీల కోసం రెండు రాష్ట్రాలు ప్రయత్నిస్తే బాగుంటుంది. ప్రత్యేక హోదాలో ఆంధ్ర ఇరుక్కుపోయింది. హోదా వచ్చే అవకాశం లేదు. కానీ హోదా తప్ప మరోటి అడిగే పరిస్థితి ఆ నాయకుల్లో కనిపించడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రకు ఏం కావాలో అడిగి సాధించుకుంటే బాగుంటుందని చెప్పాను. ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించేందుకు అనేక నిబంధనలు ఉన్నాయి. వాటిలో ఏ ఒక్కటీ ఆంధ్రకు లేదు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే విభజన సమయంలో రాజ్యసభలో హోదా గురించి ప్రధానమంత్రి ప్రకటించారు కాబట్టి ఇవ్వాలి అని అడగడం మినహా మరో బలమైన వాదన లేదు. విభజన చట్టంలో ఒక్క అంధ్రప్రదేశ్‌కే కాదు రెండు రాష్ట్రాలకు అనేక హామీలు ఉన్నాయి. వాటి అమలు కోసం ప్రయత్నించాలి. రెండు రాష్ట్రాల్లోనూ వెనుకబడిన జిల్లాలు ఉన్నాయి. వెనుక బడిన జిల్లాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని చెప్పారు. వాటిని సక్రమంగా అమలు చేయాలి. తెలంగాణకు సంబంధించి హైకోర్టు విభజన ప్రధాన సమస్య. విభజన జరిగి రెండేళ్లు గడిచిపోయినా హైకోర్టు విభజనపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. న్యాయవాదులు, న్యాయాధికారుల ఆందోళన తరువాత కూడా పరిస్థితి ఇలానే ఉంది. విభజన చట్టంలోని ప్రతి అంశాన్ని తప్పని సరిగా అమలు చేసే విధంగా కేంద్రం దృష్టి సారించాలి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా దృష్టిసారించి రెండు రాష్ట్రాల సమస్యలను పరిష్కరించాలి.

- బి వినోద్, టిఆర్‌ఎస్ ఎంపి