ఫోకస్

కుంటిసాకులు ప్రజావంచనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు ప్రజల అభీష్టానికి భిన్నంగా రాష్ట్రాన్ని ఏకపక్షంగా విభజించారు. ఆనాటి ప్రభుత్వం విభజన చట్టంలోని హామీలతో పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వేజోన్, కేంద్ర సంస్థలు, పోలవరం నిర్మాణం, ఆర్థిక లోటు భర్తీకి నిధులు, కడపకు ఉక్కు ఫ్యాక్టరీ, వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదావల్ల రాష్ట్రంలో నూతనంగా పరిశ్రమలు అభివృద్ధి చెంది ఉపాధి అవకాశాలు లభిస్తాయని యువత ఆశించింది. అలాగే వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ద్వారా తమ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల ప్రజలు భావించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులిస్తామని చెప్పి చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టితో బిజెపి ప్రభుత్వం సరిపెట్టింది. రెండేళ్లుగా ప్రత్యేక హోదా ఇవ్వాలని ఇతర హామీలన్నింటినీ నెరవేర్చాలని ఆందోళనలు కొనసాగుతూనే వున్నాయి. అయినా బిజెపి, తెలుగుదేశం ప్రభుత్వాలు దోబూచులాడుతూ రాష్ట్ర అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాయి. పార్లమెంటులో ప్రధాని చేసిన ప్రకటనకే విలువ లేదని చెప్పడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. ప్రత్యేక హోదాపై ఆర్థిక మంత్రి చెప్పిన సమాధానం తెలుగు ప్రజల మనోభావాలను తీవ్రంగా గాయపర్చింది. అందువల్లే మంగళవారంనాటి రాష్ట్ర బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా మద్దతిచ్చి జయప్రదం చేశారు. రాష్ట్భ్రావృద్ధి కోసమే బిజెపితో పొత్తు పెట్టుకున్నట్లు చెప్పుకొచ్చిన చంద్రబాబు రాష్ట్రానికి కేంద్రం చేసిన ద్రోహంపై తన వైఖరిని ప్రకటించాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా తెలుగుదేశం, బిజెపిలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, అలాగే విభజన చట్టంలోని హామీలను అమలుచేయాలని డిమాండ్ చేస్తున్నాం.

- పెనుమల్లి మధు, సిపిఎం ఏపి కార్యదర్శి