ఫోకస్

వికృతం విజయవాడ కాల్‌మనీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజలను రక్షించాల్సిన రాజకీయ, పోలీసు వ్యవస్ధలు వారి ఎలా భక్షిస్తున్నాయో విజయవాడ కాల్‌మనీ దుర్మార్గం బైటపెడుతోంది. ఒక సామాజిక రుగ్మతలా మారి కుటుంబాలను కబళించే స్ధాయికి అధి విస్తరించడం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. పౌరునిగా, పౌర సమాజ రాజకీయ ఉద్యమకారునిగా సిగ్గుపడుతున్నాం. విజయవాడ కాల్‌మనీ విషవలయం మొక్కుబడి అరెస్టులు, నాలుగు రోజుల హడావుడితో పరిష్కారమయ్యే అంశం కాదు. దీని వెనక రాజకీయ చెద పట్టిన వ్యవస్ధ ఉంది. పరపతి వ్యవస్ధను బాగుచేయడం, ఎన్నికల్లో విచ్చలవిడి డబ్బు నియంత్రించడం, దోషులకు కచ్చితంగా కఠిన శిక్ష పడేలా చట్టబద్ధపాలన అమలు లేకుండా ప్రభుత్వం కేవలం విచారణ ప్రకటనలు, నిఘా వ్యవస్ధపై నిందలకు పరిమితమవటం నాటకాలాడటమే. లేని ఆదాయంతో రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి ఏపిలో ఎన్నికైన ప్రభుత్వం పరపతి వ్యవస్ధను నాశనం చేసింది. ఆ పార్టీకి ఓట్లు వచ్చాయి. రైతులు, ఇతర పేద వర్గాలకు అప్పుదొరకడం కష్టమై పోతోంది. చాలా కాల్‌మనీ కేసుల్లో తనఖాపెట్టి మరీ బాధితులయ్యారు. ఆల్పాదాయ వర్గాలకు తనఖా ఉన్నా కూడా బ్యాంకులు రుణమివ్వకపోవడానికి అప్పులు ఎగ్గొట్టండి అనే తప్పుడు రాజకీయమే కారణం. అప్పు తీసుకుంటే బానిసలుగా మారిపోయే దుస్ధితిని పాలకులే ప్రజలకు కల్పించారరు. రుణమాఫీ వల్ల రైతులకు మేలు జరగకపోగా పరిస్ధితులు మరింతగా దిగజారాయి. ప్రభుత్వం వెంటనే ఏపి రుణ చట్టాన్ని సవరించి వడ్డీ రూ.1.50 నుంచి 2.50కు మించకుండా చట్టం చేయాలి. తీవ్రత తక్కువైనా తెలంగాణలో కూడా ఇదే పరిస్ధితి ఉంది. కరీంనగర్‌లో ఒక హెడ్ కానిస్టేబుల్ కొందరు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల అండతో వందల కోట్ల వడ్డీ వ్యాపారం చేస్తున్న కేసులో మా పార్టీని బాధితులు ఆశ్రయించారు. 1930లో అమల్లోకి వచ్చిన వడ్డీ చట్టమే (1394 ఫస్లీ) ఇప్పటికే తెలంగాణలో కొనసాగుతోంది. ఏపితో పాటు తెలంగాణలో కూడా వడ్డీ రేట్లను నియంత్రించే విధంగా పరపతి చట్టం తేవాలి. విజయవాడ కాల్‌మనీ కేసులో బాధితులకు నిజంగా న్యాయం చేస్తమని, పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామిన చెముతున్న రాష్ట్రప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పరపతి వ్యవస్ధను బాగుచేయడమే మార్గం. ఎన్నికల్లోతాత్కాలిక తాయిలాలు, డబ్బు ప్రభావాన్ని నియంత్రించేందుకు మార్పులు ఉతేవాలి. మహిళలను అంగడి సరకుగా తయారుచేసే స్ధాయికి దిగజారిన నేతలకు ఉరిశిక్ష పడేలా చట్టాలు చేయాలి. ఇందులో సమాజం బాధ్యత కూడా ఉంది. ఓటు కన్నా కులం, మతం,ప్రాంతం తాయిలాలు ఎక్కువైపోవడం, పెళ్లిళ్ల వంటి కార్యాలకు తాహతుకు మించి ఖర్చు కోసం అప్పులు చేయడం వల్ల మన జీవితాలను, బిడ్డల భవిష్యత్తును మనమే దెబ్బతీసుకుంటున్నామని ప్రజలు గుర్తించాలి

డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ లోక్‌సత్తా వ్యవస్థాపకులు