ఫోకస్

అన్ని పార్టీలదీ రాజకీయమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విభజన సమయంలో అన్ని పార్టీలూ రాజకీయం చేశాయి. రెండు రాష్ట్రాలు ఏర్పాటైన తర్వాత అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, మార్గదర్శకాలు ఏమి చేపట్టాలన్న అంశాన్ని పెడచెవిన పెట్టాయి. అయినప్పటికీ అప్పటి యుపిఎ ప్రభుత్వం బాధ్యతతో వ్యవహారించింది. విభజన బిల్లులో అన్ని అంశాలనూ పేర్కొన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు బిల్లును పంపించి, సమగ్రంగా చర్చించి, అవసరమైన సలహాలు, సూచనలు చేయాల్సిందిగా పేర్కొన్నా పట్టించుకోలేదు. అప్పటి ప్రతిపక్షాలకు రాజకీయం చేయడంతోనే సమయం వృధా చేసి సంతృప్తి చెందాయి. కానీ బిల్లుపై సమగ్రంగా చర్చించలేదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రకు ప్రత్యేక హోదా కల్పించాల్సిన అవసరం ఉందని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నిండు సభలో చాలా స్పష్టంగా చెప్పారు. దీనిని బిల్లులలో చేర్చాలన్న ఆలోచనను మిగతా పార్టీలు చేయలేకపోయాయి. అప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బిజెపి ఆంధ్రకు ప్రత్యేక హోదా ఐదేళ్ళు కాదు పదేళ్ళు కల్పించాలని, తాము అధికారంలోకి వస్తే కల్పిస్తామని గొప్పగా ప్రకటించింది. అమరావతి శంకుస్థాపనకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరైనప్పుడు విభజన బిల్లులోని అన్ని అంశాలను అమలు చేస్తామని బహిరంగ సభలో చెప్పారు. బిల్లులోని అంశాలు అంటే విభజన సమయంలో జరిగిన చర్చలో ప్రస్తావనకు వచ్చిన ప్రత్యేక హోదా అంశం అని కూడా ప్రజలు భావించారు. ఆ స్పూర్తితోనే ప్రధాని మోదీ మాట్లాడారని అనుకుంటారు. ఇప్పుడేమో సాంకేతిక అంశాలే మాట్లాడుతున్నారు. నాడు విభజన చట్టంలో ప్రత్యేక హోదా లేదని చెప్పడం సమంజసం కాదు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా తెలంగాణకు సంక్రమించిన అధికారాలను, హక్కులను అమలు చేయడంలో, కేంద్రం నుంచి నిధులను, పథకాలను తెచ్చుకోవడంలో ఘోరంగా విఫలమైంది. తెలంగాణకు ప్రత్యేక హోదా గురించి నాడు ప్రస్తావనకు రాకపోయినా, చట్టంలో లేకపోయినా, ప్రత్యేక హోదాతో సమానంగా అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం వాటిని కేంద్రం నుంచి తెచ్చుకోవడంలో విఫలమవుతోంది. హైదరాబాద్ అభివృద్ధికి మినహా మిగతా జిల్లాల అభివృద్ధికి కొత్త ప్రతిపాదనలు ఏవీ కేంద్రానికి పంపించలేదు. స్మార్ట్ సిటీల హామీ కూడా మలి విడతలోనే కేంద్రం ప్రకటించింది. లక్ష కోట్లతో హైదరాబాద్‌కు ఐటిఆర్ రావాల్సి ఉండగా, ఒక్క పైసా కూడా తేలేకపోయింది. హైకోర్టు విభజనవంటి ఎన్నో అంశాలు, సమస్యల పరిష్కారానికి కేంద్రంపై వత్తిడి తేవడంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైంది.

- కె.ఆర్. సురేశ్ రెడ్డి మాజీ స్పీకర్, తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు