ఫోకస్

హోదాలేకున్నా.. మరోమార్గం ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా కేంద్ర ప్రభుత్వం ఉదారంగానే అనేక ప్రాజెక్టులను మంజూరు చేస్తోంది. కాంగ్రెస్ అధికారంలో ఉండగా, రాష్ట్ర విభజన చట్టంలో ప్రత్యేక హోదాను చేర్చకపోవడానికి బలమైన కారణాలున్నాయి. రాజ్యాంగపరంగా ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే, దాని పరిణామాలు అనేకం ఉంటాయి. అందుకే కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ-2 ప్రభుత్వం తరఫున ఆనాటి ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్‌సింగ్ విభజన తర్వాత ఎపికి ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంట్‌లో ప్రకటన చేశారే తప్ప, ఆ హామీని విభజన చట్టంలో చేర్చలేదు. ఇప్పడు ఎపిలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ-కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. ఈ సత్సంబంధాల వల్లనే కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్, ఐఐటి తదితర అనేక ప్రతిష్ఠాత్మక సంస్థలను మంజూరు చేసింది. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చింది. పది, పదిహేను సంవత్సరాలు పోరాడితేతప్ప రాని ఈ సంస్థలు ఎలాంటి పోరాటం లేకుండా కేంద్రం మంజూరు చేయడం గొప్ప విషయం. అలాగే తిరుపతి ఎయిర్‌పోర్ట్‌కు అంతర్జాతీయ హోదా ఇస్తూ, అందుకు తగ్గట్టుగా అభివృద్ధి పనులు చేపట్టింది. ఇవికాకుండా అనేక విమానాశ్రయాలు ఇవ్వడంతోపాటు అభివృద్ధి పనులకు నిధులను సమకూరుస్తోంది. వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా, మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పడితే కేవలం ఉత్తరాంచల్‌కే ప్రత్యేక హోదా ఇచ్చి, మిగతా రెండింటికీ ఇవ్వలేదు. ఉత్తరాంచల్ పూర్తిగా అటవీ ప్రాంతంగా ఉండటంవల్ల ప్రత్యేక హోదాకు తగ్గ రాష్ట్రంగా భావించారు. మిగతా రెండు రాష్ట్రాలు జార్ఖండ్, చత్తీస్‌గఢ్‌లు పోరాటం చేసినా ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌తోపాటు మరికొన్ని రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా కావాలని అంటున్నాయి. ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వకూడదని తమిళనాడు ఇప్పటికే అభ్యంతరం చెప్పింది. ఎపికి ప్రత్యేక హోదా ఇస్తే అక్కడి పరిశ్రమల్లో 15-20 శాతం వరకు ఎపికి తరలిపోతాయన్నది తమిళనాడు భయం. ఎపిలో రాజకీయ పార్టీలు కేవలం తమ లాభంకోసం ప్రత్యేక హోదాను అడ్డుపెట్టుకుంటున్నాయనిపిస్తోంది. విపక్షాలు రాష్ట్రానికి ఒక రకంగా అన్యాయం చేస్తున్నాయని చెప్పవచ్చు. ప్రత్యేక హోదా ఇవ్వడానికి రాజ్యాంగపరంగా కుదరదు కనుక, తాడు తెగేదాక లాగవద్దన్న సిద్ధాంతాన్ని అమలుచేయాలి. ఎపికి అన్యాయం జరిగిందని అన్ని పక్షాలు కలిసి కేంద్రం వద్దకు వెళ్లి రాష్ట్ర అభివృద్ధికి కావలసిన అంశాలపై చర్చించి, వాటిని సాధించడమే విజ్ఞతగా అనిపించుకుంటుంది.