ఫోకస్

వెనుకబడిన జిల్లాలకు ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్లమెంట్ వేదికగా ప్రధాన మంత్రి ఇచ్చిన హామీనుంచి కేంద్ర ప్రభుత్వం తప్పించుకోలేదు. ప్రభుత్వం ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే దేశ సమగ్రత, ఐక్యతకు ప్రమాదం. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై 2014 ఫిబ్రవరిలో రాజ్యసభలో ప్రధాని స్వయంగా ఇచ్చిన హామీ చట్టంతో సమానమే. ఏపి మొత్తానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఇతర రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వస్తాయనుకుంటే, అదేస్థాయి సాయానికి మరో పరిష్కారం ఆలోచించాలి. వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక హోదా ఇచ్చే ఫార్ములాను రూపొందించాలి. రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణలోని జిల్లాలుసహా దేశవ్యాప్తంగా వంద వెనుకబడిన జిల్లాలకు పారిశ్రామిక పన్ను రాయితీలు ఇవ్వాలి. దీంతో ఏ రాష్ట్రానికి కూడా అభ్యంతరాలు చెప్పే అవకాశం ఉండదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్ ఆదాయాన్ని కోల్పోయే ఆంధ్రా ప్రాంతానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని మొట్టమొదటిసారిగా ప్రతిపాందించింది లోక్‌సత్తానే. మొత్తం ఏపికి ప్రత్యేక హోదా అంటే ఇతర రాష్ట్రాల నుంచి చిక్కులు వచ్చే అవకాశముంటుందనే ముందుచూపుతోనే రాయలసీమకు హోదా, వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఉత్తర తెలంగాణకు ప్రత్యేక సాయం అందించాలని 2014 జనవరిలోనే శాసనసభలో కోరాం. కానీ రాష్ట్రం మొత్తానికీ ఇస్తామని ప్రధాని, ప్రతిపక్షం, బిజెపి చెప్పడంతో వచ్చే అవకాశానికి మోకాలడ్డటం ఎందుకని మద్దతిచ్చారు. ఆ తరువాత ఏపికి ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం వంటి విభజన చట్టంలోని అంశాల అమలుకు ‘తెలుగు భవిత’ పేరుతో 2015లో ఏపిలోని మూడు ప్రాంతాలు హైదరాబాద్‌లో దీక్షా కార్యక్రమాలు, రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక హోదా ఇవ్వడానికి ప్రత్యామ్నాయం ఆలోచించాలని అందరూ కోరారు. కేంద్రం ప్రత్యేకించి ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని, రెవెన్యూ లోటు పరంగా ఏపితోపాటు పశ్చిమ బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాలకు కూడా సాయం అందించింది. ఏపి అప్రమత్తమై 14వ ఆర్థిక సంఘం పత్రాలను విడుదల చేయాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులతోపాటు అన్ని పార్టీలూ కలసికట్టుగా ప్రత్యేక హోదా, విభజన చట్టం అమలు, తెలుగు రాష్ట్రాలకు మరిన్ని అధికారాలకోసం పోరాడాలి.

-జయప్రకాష్ నారాయణ్ లోక్‌సత్తా, వ్యవస్థాపకుడు