ఫోకస్

అనవసర పోటీ వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నో దశాబ్దాలుగా అసంపూర్తిగా నిలిచిన వివిధ సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సారించకుండా అసాధ్యభరితమైన సరికొత్త ప్రాజెక్టులపై తెలుగు రాష్ట్రాలు పోటీతత్వంతో ముందుకు సాగుతుండటం ప్రజాధనం దుర్వినియోగం మినహా రైతాంగానికి ఉపకరించడం అనేది శూన్యం. పట్టిసీమ ద్వారా గోదావరి నుంచి 80 టిఎంసిల నీటిని మళ్లిస్తామని చెబితే ప్రస్తుతం మూడు లేదా నాలుగు వేల క్యూసెక్కులకు మించినీటి సరఫరా జరుగటం లేదు.. పూర్తిస్థాయిలో నీటి సరఫరాపై దృష్టి సారించకుండా సిఎం చంద్రబాబు గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానమంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ఏనాడో ఎన్టీఆర్ ప్రారంభించిన తెలుగుగంగ, గాలేరు-నగరి ప్రాజెక్టులే పూర్తికాలేదు. ముందుగా కాలువల ఆధునికీకరణ చర్యలు చేపట్టాలి. హంద్రీ-నీవా నుంచి జీడుపల్లి రిజర్వాయర్‌కు నాలుగు స్టేజీలలో ఎత్తిపోతల ద్వారా నీటి మళ్లింపుకోసం భారీఎత్తున విద్యుత్ సబ్ స్టేషన్లు వెలిసాయి. 12 సంపుల్లో నాలుగు ఆన్ చేస్తేనే ఎక్కడో ఒకచోట గండి పడుతున్నది. గోదావరి ఎడమ కాలువద్వారా విశాఖకు నీటి మళ్లింపుకోసం పురుషోత్తపట్నంలో ఎత్తిపోతల చేపడుతామంటున్నారు. అదికూడా సాధ్యమయ్యేది కాదు. ఇక తెలంగాణ ప్రభుత్వం అటు గోదావరిపై ఇటు కృష్ణాకు అనుబంధంగా రీడిజైన్లతో సరికొత్త ప్రాజెక్టులు చేపట్టటానికి సన్నద్ధమవుతున్నది. ఇందుకోసం 80వేల కోట్ల రూపాయల సొమ్ము, ఆపై విద్యుత్ అవసరం.. ప్రాణహిత-ఇంద్రావతి నదులద్వారా వృథాగా పోయే నీటిని నాలుగు బ్యారేజీల నిర్మాణం ద్వారా ఎత్తిపోతల ద్వారా వెల్లంపల్లికి నీటిని మళ్లించే ప్రయత్నం జరుగుతున్నది. 2 టిఎంసిల సామర్థ్యం కల్గిన మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను 50 టిఎంసిల పెంపుకు మరో విశ్వప్రయత్నం జరుగుతున్నది. రీడిజైనింగ్‌లతో అనధికారిక ప్రాజెక్టులను ఎగువ చేపడితే భవిష్యత్‌లో గోదావరి ఎండి తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలనేకం తీవ్ర సమస్యలెదుర్కొంటాయి. మరోవైపు కృష్ణానదిపై శ్రీశైలం నుంచి నీటిని 650 అడుగుల ఎత్తుకు నాలుగు స్టేజీలలో పాలమూరు, రంగారెడ్డి, ఉండి ప్రాజెక్టుల నిర్మాణానికి కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధపడుతున్నది. దీనికి 450 మెవా విద్యుత్ అవసరం. 89 టిఎంసిల నీరు నిలువకు 40వేల ఎకరాల భూమి కావాలి. ఇన్నివేల కోట్లు ఖర్చు చేస్తే ఆశించిన ప్రయోజనం ఉంటుందా లేదా అన్నది ప్రభుత్వం ఆలోచించకపోవటం విచారకరం... భవిష్యత్‌లో కృష్ణా, గోదావరిలో తగినంత నీరు లేకపోతే ఈ ప్రాజెక్టులన్నీ వెలవెలపోవాల్సిందే కదా.

- యెర్నేని నాగేంద్రనాథ్ రైతు సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు