ఫోకస్

దృష్టి మళ్లించేందుకే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్న రాష్ట్రాలకు మాత్రమే ప్రత్యేక హోదా ఇచ్చారు. 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంది. జన సాంద్రత తక్కువగా ఉండడం, ప్రకృతిపరంగా అభివృద్ధికి అవకాశాలు లేకపోవడం, వనరులు లేకపోవడం, పరిశ్రమల లేకపోవడం వల్ల ఆదాయం లేక అభివృద్ధి సాధించలేకపోవడం, దేశ సరిహద్దుల్లో ఉండడం వంటి పలు కారణాలతో ప్రత్యేక హోదా ఇచ్చారు. ఈ 11లో ఏడు ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్, ఉత్తరాంచల్ లాంటి రాష్ట్రాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు ఈ లక్షణాలు ఏమీ లేవు. ఆంధ్రప్రదేశ్ జిడిపి 8 శాతం. అన్ని వనరులు ఉన్నాయి. ప్రంచంలో ఎక్కడా లేని విధంగా రాజధాని నగరాన్ని నిర్మిస్తామని చెబుతున్నాం. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని చెబుతున్నాం. దేశంలోనే అత్యధికంగా అభివృద్ధి రేటు అని మనమే చెప్పాం మరి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఎలా ఇస్తారు. ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోదీ కూడా హామీ ఇచ్చారు కాబట్టి హోదా ఇవ్వాలి అని అడుగుతున్నాం. ఎన్నికల్లో రాజకీయ నాయకులు గత 70 ఏళ్ల నుంచి ఎన్నో హామీలు ఇస్తున్నారు. అవన్నీ అమలు అవుతున్నాయా? ఒకవైపు లోటు బడ్జెట్ అని చెబుతూ మరోవైపు ఖర్చుపై నియంత్రణ లేకుండా పోయింది. రాజధాని నగరంలో మూడుసార్లు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల పేరుతో వందల కోట్ల రూపాయలు వ్యయం చేశారు. ప్రజలకు కానుకలు ప్రకటిస్తున్నారు. ఎందుకీ కానుకలు. ఒకవైపు రెవెన్యూ లోటు ఉంటే మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు 43శాతం పిఆర్‌సి అవసరమా? కేంద్రం ఇచ్చిన నిధుల వ్యయం సక్రమంగా జరుగుతుందా? కేంద్రం ఇచ్చిన నిధులను వ్యయం చేసిన లెక్కలు చెప్పాలి, అలా చెబుతున్నారా? చెప్పడం లేదనే వార్తలు వస్తున్నాయి. కేంద్రంతో ఘర్షణ వైఖరితో కాకుండా సామరస్య పూర్వకంగా రాష్ట్రానికి కావలసినవి సాధించుకోవాలి. ఆంధ్రలో అనంతపురం, కడప, విజయనగరం వంటి పలు జిల్లాలు వెనుకబడి ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రాజెక్టులు చేపట్టదలిచాం, దానికి కేంద్రం సహాయం చేయాలని కోరడం మంచిది. హోదా ఇచ్చే అవకాశం లేనప్పుడు ఆ పేరుతో ఉద్యమం జరపడం మంచిది కాదు. ప్రజల దృష్టిని మళ్లించడానికే ఆంధ్రప్రదేశ్‌లోని మూడు నాలుగు పార్టీలు హోదా పేరుతో ఉద్యమాలు చేస్తున్నాయి. పార్టీలకు తోడుగా ఇప్పుడు సేనలు రంగ ప్రవేశం చేశాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యయం తగ్గించుకుని రాష్ట్ర అభివృద్ధిపై దృష్టిసారించాలి.

- త్రిపురనేని హనుమాన్ చౌదరి ప్రజ్ఞ్భారతి