ఫోకస్

పారదర్శకమే ప్రధానం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జిల్లాల విభజన ఎలాంటి హిడెన్ అజండా లేకుండా పూర్తిగా పారదర్శకతతో జరగాలి. జిల్లాల విభజననను సూత్రప్రాయంగా సమర్థిస్తున్నాం. విభజన జరగడం వల్ల పరిపాలనాపరంగా అనేక లాభాలు ఉన్నాయడంలో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణలో కేవలం 10 జిల్లాలే ఉన్నాయని ప్రచారం జరిగితే, విదేశాల్లోని పెట్టుబడిదారులు, స్వదేశంలోని పెట్టుబడిదారులు ముందుకు రాకపోవచ్చు. అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనుకునే వారు ముందుకు రాకపోవచ్చు. రాష్ట్భ్రావృద్ధిలో భాగస్వామ్యం కావాలని ముందుకు వచ్చేవారు కేవలం పది జిల్లాలే ఉంటే ముందుకు రారేమో అనిపిస్తుంది. ఎక్కువ జిల్లాలు ఉండటం వల్ల వ్యాపారం పెరుగుతుందని భావిస్తారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో 27 జిల్లాలున్నాయని అధికారికంగా ప్రచారం జరిగితే రాష్ట్రానికే మంచిది. వికేంద్రీకరణ ఏ విధంగా జరిగినా ప్రజల సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకునే చేయాలి. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్‌ను రెండు రాష్ట్రాలుగా విభజించే సమయంలో కొంతమంది విభజనను గట్టిగా వ్యతిరేకించారు. కేంద్ర ప్రభుత్వం అన్ని కోణాల్లో ఆలోచించి, రాష్ట్రాన్ని విభజించింది. దాదాపు రాకీయ పార్టీలు కూడా అన్నీ సమర్థించాయి. ఇప్పుడు చూడండి.. రెండు రాష్ట్రాలు కూడా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పోటీపడి అమలు చేస్తున్నాయి. అదే విధంగా జిల్లాల సంఖ్యను పెంచడం వల్ల జిల్లాల అభివృద్ధి జరుగుతుందనడంలో సందేహం లేదు. రోడ్లు, తాగునీరు, మురుగునీటి పారుదల, సాగునీరు, పరిశ్రమల ఏర్పాటు, మానవవనరుల అభివృద్ధి తదితర అంశాల్లో వేగంగా అభివృద్ధి జరిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఎన్‌టి రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా, తహశీళ్ల స్థానంలో మండలాలు ఏర్పడ్డాయి. ఒక్కో తహశీల్‌లో నాలుగు, ఐదు మండలాలు కూడా ఏర్పడ్డాయి. దాని వల్ల ప్రజలకు మండలస్థాయి అధికారులు అందుబాటులోకి వచ్చారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక దెబ్బకు రెండుపిట్టలు అన్న చందంగా వ్యవహరిస్తున్నారనిపిస్తోంది. ఒక శాసనసభా నియోజకవర్గం రెండు మూడు జిల్లాల్లో కలుస్తోంది. దీనివల్ల కాంగ్రెస్, టిడిపి తదితర పార్టీలకు చెందిన పాత నాయకులను బలహీనపరుస్తూ, టిఆర్‌ఎస్ తరఫున కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించాలన్నది కెసిఆర్ ‘హిడెన్ అజండా’గా ఉన్నదనిపిస్తోంది. వికేంద్రీకరణ సమయంలో ప్రజల పరిస్థితిని, వారి అవసరాలను ప్రధానంగా ప్రభుత్వం దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలి.

- కె. నారాయణ సిపిఐ జాతీయ కార్యదర్శి