ఫోకస్

చెలరేగుతున్న మాఫియాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవ్యాంధ్ర రాజధాని అమరావతి చెంతన ఉన్న విజయవాడ నగరం మాఫియా శక్తులకు కేంద్ర స్థానంగా మారింది. కొత్త రాష్ట్రం కొత్త రాజధానితో విరాజిల్లాలని ప్రజలంతా అనుకుంటుంటే అరాచక శక్తులు మాత్రం రాజ్యమేలుతున్నాయి. పరిపాలనా దక్షుడిగా పేరున్న చంద్రబాబు ప్రస్తుతం తన పరిపాలన ఏ దిశగా సాగుతోందనే కోణంలో ఆలోచిస్తే మాఫియా శక్తులు ఊపందుకున్నట్లు కనిపిస్తుంది.
ఇసుక, మద్యం, కాల్‌మనీ మాఫియా కాకుండా మహిళలను లోబర్చుకుని బలవంగా వ్యభిచార రొంపిలో దింపే ముఠాలు వేళ్లూనుకుంటున్నాయి. వీటి ప్రభావం ప్రభుత్వ పాలనపై స్పష్టంగా పడుతుంది. తాజాగా వెలుగు చూసిన కాల్‌మనీ ఉదంతాన్ని ఒక్క కోణంలో చూస్తే సరికాదు. వీటిలో దౌర్జన్యం, అధిక వడ్డీ, వేధింపులు, భయపెట్టడం, మహిళల మాన ప్రాణాలను హరించడం వంటి సంఘటలు కలిసి ఉన్నాయి. వీటిని ఒక్కొక్కటిగా పరిశీలించి ఉక్కుపాదంతో అణచివేయాలి.
అంతేకాని విషయ తీవ్రతను తగ్గించడం, అంశాన్ని పక్కదారి పట్టించే చేష్టలు ప్రభుత్వం మానుకోవాలి. ఈ కేసుల్లో తెలుగుదేశం పార్టీతో పాటు మిగిలిన పార్టీల్లోని నేతలకు సంబంధం ఉందని చెప్పుకోడం జరిగింది. నిందితుడు ఎవరైనా ముందు అరెస్టు చేసి విచారణ చేసి కఠినంగా శిక్షించాలి. అధికార పార్టీ తరఫున కూడా ఎవరైనా తప్పు చేసి ఉంటే వారిని విచారించాలి. ఇదివరకు ఎమ్మార్వో వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని దాడి చేస్తే అతనిపై చర్యలు లేవు. కనీసం విచారించలేదు. చాలా నిస్సిగ్గుగా అతనిని వదిలి వేశారు.
దీంతో తెలుగుదేశం పార్టీ నేతలకు అడ్డూ అదుపులేకుండా పోయింది. అప్పుడే చింతమనేనిపై కఠినంగా వ్యవహరించి ఉండి ఉంటే ఇప్పుడు ఇంత సాహసం చేసేందుకు భయపడేవాళ్లు. వడ్డీ వ్యాపారం తప్పన్నట్లు ప్రభుత్వం దాడులు చేయడం వల్ల సామాన్య ప్రజలు దెబ్బతినే ప్రమాదం ఉంది. వడ్డీ వ్యాపారంముసుగులో చెలరేగిపోయే శక్తులను మాత్రమే ప్రభుత్వం నియంత్రించాలి. ఈ కేసులను విచారించేందుకు రిటైర్డు జడ్జిని నియమించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం సరికాదు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి.
తద్వారా వాస్తవాలు బయటకు రావాలి. పటిష్ట చట్టం తయారు చేయడం ద్వారా కాల్‌మనీ వంటి అరాచక శక్తులకు అడ్డుకట్ట వేయాలి. అంతే గానీ అసలు విషయాన్ని పక్కదారి పట్టే చర్యలను ఆపాలి. ఇప్పటికైనా కాల్‌మనీ కేసును భిన్నకోణాల్లో చూసి విచారణ ముమ్మరం చేయాలి తప్ప కేసును నీరుగార్చే ప్రయత్నం మానుకోవాలని సిపిఐ తరఫున కోరుతున్నాము.

కె.రామకృష్ణ సిపిఐ ఏపి రాష్ట్ర కార్యదర్శి