ఫోకస్

ప్రామిసరీ నోట్ల్ల రిజిస్ట్రేషన్ తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రామిసరీ నోట్లను 24గంటల్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించేవిధంగా చట్టం చేయటం ద్వారా వడ్డీ వ్యాపారుల దురాగతాలకు అడ్డుకట్ట వేయవచ్చు. దీని కోసం రాష్ట్రప్రభుత్వం ఒక విధానాన్ని రూపొందించాల్సి ఉంటుంది. అప్పు తీసుకున్న వారితో రాయించుకుని, సంతకం చేయించుకున్న ప్రామిసరీ నోటును ఆన్‌లైన్‌లో ప్రభుత్వం నిర్ణయించిన వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేయించటం లేదా మరో విధంగానైనా రిజిస్ట్రేషన్ చేయించటం వంటి విధానాన్ని రూపొందిస్తే ప్రామిసరీ నోట్లను అడ్డుపెట్టుకుని అప్పు తీసుకున్న వారిని దోపిడీచేసే విధానాలను ఆపేందుకు అవకాశం ఉంటుంది. దీనితో పాటే వడ్డీ రేట్లపై నియంత్రణ ఉండాలి. సాధారణంగా కాల్‌మనీ దుర్మార్గాలకు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలకు చెందిన ప్రజలు, చిరు వ్యాపారులే ఎక్కువ బలవుతున్నారు. ఈ వర్గాల అవసరాలకు తగిన విధంగా బ్యాంకింగ్ విధానాలను కాస్తంత సరళీకృతం చేయాల్సి ఉంటుంది. అందులోనూ చిరు వ్యాపారులకు బ్యాంకుల నుండి రుణాలు అందనంత కాలం కాల్‌మనీ వ్యవహారాలు, వడ్డీ వ్యాపారుల ఆగడాలు కొనసాగుతూనే ఉంటాయి. ఇక మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు వైద్యం, విద్య అందుబాటులో లేనంత కాలం ప్రయివేటు వడ్డీ వ్యాపారులపై ఆధారపడక తప్పదు. అందువల్ల రాష్ట్రప్రభుత్వం మెరుగైన వైద్యాన్ని ప్రభుత్వాసుపత్రిలో అందించటంతో పాటు, ప్రభుత్వ విద్యాసంస్థలను మెరుగైన విద్యాప్రమాణాలతో తీర్చిదిద్దాలి. లేదంటే మధ్యతరగతి ప్రజలు తమ పిల్లలను ఉన్నత చదువులను చదివించుకోవాలన్న ఆతృతతో ప్రయివేటు విద్యాసంస్థల్లో చేర్పించేందుకు అధిక వడ్డీలకు అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరోపక్క కుటుంబ సభ్యుల్లో అనారోగ్యం కలిగినపుడు ప్రయివేటు ఆసుపత్రులకు వెళ్లి, ఖర్చు తట్టుకోలేక అప్పుల పాలవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రప్రభుత్వం విద్య, వైద్య రంగాలను ప్రయివేటు రంగానికి ధీటుగా అభివృద్ధిచేసి, సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉంచటంతో పాటు, బ్యాంకింగ్ రంగంలో కేంద్రప్రభుత్వం మార్పులు తీసుకొచ్చి చిరు వ్యాపారులు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు తేలికగా రుణాలు అందించే విధానాన్ని అమలుచేయాలి.కాల్‌మనీ ఆగడాలు వెలుగు చూసిన తరువాత వడ్డీ వ్యాపారులను సంఘ విద్రోహశక్తులుగా అంతా చూస్తున్నారు. ఇది కూడా సరికాదు. ప్రామిసరీ నోట్లను ఆన్‌లైన్‌లో లేదా మరో విధంగానైనా రిజిస్ట్రేషన్ చేయటం, ఆదాయపన్ను పరిధిలోకి తీసుకురావటం తదితర చర్యలు చేపట్టాలి. లేదంటే సమాజంలో కనీసం అప్పు కూడా పుట్టని పరిస్థితి ఏర్పడుతుంది. ఇది కూడా ప్రమాదమే. ప్రజలు కూడా ఆర్ధిక క్రమశిక్షణను పాటించాలి. అవసరానికి, ఆదాయానికి మించి ఖర్చు చేయటం, అనవసర ఖర్చులకు అప్పులు చేయటం వంటివి చేయకూడదు.

డాక్టర్ ఆకుల సత్యనారాయణ శాసనసభ్యుడు