ఫోకస్

దా‘రుణాల’ దారి.. కాల్‌మనీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉద్యోగం, వ్యవసాయం, వ్యాపారం, వాణిజ్యం ఏదైనా కావచ్చు, విధి విధానాలకు లోబడి ఏ వ్యాపారం చేసినా, ఏ వాణిజ్యం చేసినా ఎవరికీ ఎలాంటి సమస్యలూ ఉండవు, నిబంధనలను ఉల్లంఘించినపుడే అసలు చిక్కు వచ్చిపడుతుంది. ఆర్ధిక సంస్థలు మన దేశంలో కొత్త కాదు, వడ్డీవ్యాపారాలు చేసే సంస్థలు, ఆర్ధిక రుణాలను అందించే సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. అతి పెద్ద ఆర్ధిక సంస్థ ఆర్‌బిఐ మనదేశంలో ఉండనే ఉంది, బ్యాంకులు, ఇతర సంస్థలు కూడా రుణాలను జారీ చేసే పని చేస్తునే ఉన్నాయి. పరిస్థితులు మారి పేదవాడికి చేరువయ్యే క్రమంలో ప్రైవేటు ఆర్ధిక సంస్థలు, రుణాలను జారీ చేసే ఫైనాన్స్ కంపెనీలు, మైక్రో ఫైనాన్స్ కంపెనీలు వెలిశాయి. ఇవన్నీ ఆర్‌బిఐ నిబంధనలను తప్పనిసరి పాటించాల్సి ఉంటుంది. అలాగే రాష్ట్రాల్లోని చిట్‌ఫండ్, ఫైనాన్స్ వ్యాపారాల నిబంధనలనూ పాటించాల్సి ఉంటుంది. స్థానిక నగరాల్లోని పోలీసు ఇతర సంబంధిత శాఖల ఆంక్షలను పట్టించుకోవలసి ఉంటుంది. ఇన్ని వ్యవహారాల మధ్య ప్రతి పట్టణంలోనూ వడ్డీవ్యాపారాలు గుట్టుచప్పుడుకాకుండా నడుస్తున్నాయి. కొన్ని సంస్థాగతంగా నిర్వహిస్తుండగా, మరికొన్ని వ్యక్తుల చేతులమీదనే చట్టాలకు అతీతంగా నడిచిపోతున్నాయి. ఏదైనా వివాదం జరిగినప్పుడు మాత్రమే చిట్‌ఫండ్‌ల గురించి, వడ్డీవ్యాపారాల గురించి, బాధితుల వ్యవహారాలు బయటకు రావడం విస్తృతమైన చర్చ జరగడం, కొన్నాళ్లకు అది మరిచిపోవడం మామూలైపోయింది. 8 ఏళ్ల క్రితం ఒక ఫైనాన్స్ కంపెనీ గురించి పెద్దగా చర్చ జరిగింది, తర్వాత దాని ఊసే లేకుండా పోయింది. తాజాగా విజయవాడలోని ఘటనలతో మరోమారు ఆర్ధిక సంస్థల తీరుతెన్నులపై చర్చకు తెరతీసింది. ‘కాల్‌మనీ రాకెట్ కేసులో నిందితులెవరూ చట్టంనుంచి తప్పించుకోలేరు. ఎవరు తప్పు చేసినా వదలిపెట్టం. సాక్ష్యాధారాలు తెస్తే వాటిని ప్రాతిపదికగా చేసుకుని దోషులెవరైనా, ఏ పార్టీ వారైనా, ఎటువంటి ఒత్తిడులకు లోనుకాకుండా కఠినంగా చట్ట ప్రకారం శిక్షించేందుకు చర్యలు తీసుకుంటాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభలో ప్రకటించారు. కాల్ మనీ వ్యవహారంపై అసెంబ్లీలో గందరగోళంతో పాటు పెద్ద దుమారం చెలరేగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బజారు రౌడీల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుయ్యబట్టగా, ఈ ప్రభుత్వానికి సిగ్గుండాలని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎదురు దాడి చేశారు. టిడిపి-వైకాపా ఎమ్మెల్యేలు పరస్పరం విమర్శించుకున్నారు. కాల్‌మనీ వ్యవహారంలో వైకాపా నేతలే 65 మంది ఉన్నారని సిఎం చంద్రబాబు శాసనసభలో పేర్కొన్నారు. కాల్‌మనీ వ్యవహారంలో ఎవరు ఉన్నా వదిలి పెట్టమని హెచ్చరించారు. జ్యుడిషీయల్ విచారణ జరిపిస్తున్నామని, కమిషన్‌కుగానీ, పోలీసులకు గానీ ఫిర్యాదు చేయవచ్చని సిఎం అన్నారు. తాను ఎవరికీ భయపడనని, గత ప్రభుత్వం దీనిని అరికట్టేందుకు శ్రద్ధ చూపలేదని ఆయన విమర్శించారు. కాల్‌మనీ నిందితులపై 13 జిల్లాల్లోనూ ప్రభుత్వం 227 కేసులు నమోదు చేసింది. 188 మందిని అరెస్టు చేసింది. ఇందులో 65 మంది వైకాపా నేతలు, 20 మంది టిడిపి నేతలు, 12 మంది కాంగ్రెస్, ఆరుగురు కాంగ్రెస్, ఒకరు సిపిఎం, నలుగురు బిజెపి, ఇద్దరు లోక్‌సత్తా, ఏ పార్టీకి చెందని వారు 78 మంది ఉన్నారు. విజయవాడ సిటీలో 34 కేసులు, తర్వాత గరిష్టంగా గుంటూరులో 34, తూర్పుగోదావరిలో 20, కృష్ణాలో 18, కర్నూలులో 13, విజయనగరంలో 15 కేసులు నమోదయ్యాయి. కాల్‌మనీలో మరో చీకటికోణం స్వల్పమొత్తం అప్పునకు అధికమొత్తంలో వడ్డీ గుంజడమేగాక, రుణాలు తీసుకున్న మహిళలను వ్యభిచారం చేయమని ఒత్తిడి చేయడం లేదా వారిని లైంగికంగా వేధించడం కూడా జరిగిందనే ఫిర్యాదులతో కాల్‌మనీ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. అధిక వడ్డీ వసూలుతో పాటు ఇళ్లపై దాడులు చేయడం, బాధితులను హింసించడం, లైంగిక వేధింపులు, ఇళ్లు డాక్యుమెంట్లను కొల్లగొట్టడం, పురుషులను బంధించడం, మహిళలను హేళన చేయడం వంటి ఆరోపణలు రావడంతో కాల్‌మనీ వ్యవహారం తీవ్రమైన అంశంగా ప్రభుత్వం పరిగణించింది. ఇందులో అన్ని రాజకీయ పార్టీల నాయకుల ప్రమేయం ఉన్నట్టు ప్రాధమిక పరిశీలనలో తేలింది. కాంగ్రెస్ , టిడిపి, వైకాపాతో పాటు లోక్‌సత్తా వరకూ అన్ని పార్టీల నేతల ప్రమేయాన్ని ఇప్పటికే పోలీసులు ధృవీకరించారు. దర్యాప్తు కొనసాగుతోంది. ఒకటి రెండు రోజుల్లో మాజీ న్యాయమూర్తితో న్యాయవిచారణ జరిపించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఆ విచారణలో ఇప్పటికీ తెలియని అంతర్గత అంశాలు వెల్లడవుతాయి.
వడ్డీవ్యాపారాల నీలినీడలు ఇప్పుడు కొత్తకాదు, ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. భర్తను అమెరికాకు పంపడానికి అప్పుచేసిన మహిళపై వ్యాపారి లైంగికదాడులకు దిగితే ఆమె ఆ వ్యాపారిని నరికి మూటకట్టి వారం పాటు తన ఇంట్లోనే దాచిన ఘటన కూడా వెలుగు చూసింది. ఇలాంటి ఘటనలకు అడ్డుకట్టవేయాలంటే ఏం చేయాలి? ఈ పరిస్థితులను అధిగమించడంపై విశే్లషణే ఈ వారం ఫోకస్...