ఫోకస్

పవిత్ర లక్ష్యం నెరవేరడం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొంతమంది రాజకీయ నాయకులు నేర చరిత్ర ఉన్నవారితో సత్సంబంధాలు కొనసాగించడం దురదృష్టకరం. దీంతో పేద ప్రజలకు, సమాజానికి సేవ చేయాలన్న నాయకుల పవిత్ర లక్ష్యం నెరవేరడం లేదు. ఇటీవల జరిగిన, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆందోళన కలిగిస్తున్నది. ప్రజలకు రాజకీయ నాయకులను అసహ్యించుకునే పరిస్థితి కనిపిస్తున్నది.
పేదలకు సేవలందించాలన్న ఆలోచనకంటే అధికారంకోసం జరిగే ఆట (పవర్ గేమ్)లో ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. దీంట్లో నేరస్థుల జోక్యం పెరగడం కలవరపరుస్తున్నది. కొంతమంది తమ అక్రమ సంపాదనను పరిరక్షించుకోవడానికి రాజకీయాల్లోకి రావడం, రాజ్యాంగబద్ధమైన పదవుల్లోకి రావడం జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. నేరస్థులు రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు. మరి కొంతమంది రాజకీయ నాయకులు నేరుస్థులతో సంబంధాలు కొనసాగిస్తున్నారు. దీంతో సంస్థాగతమైన అవినీతి జరుగుతోంది.
లోగడ కొంతమంది అవినీతి రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాలకోసం నేరస్థులను కాపాడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా మారాయి. నేరస్థులే రాజకీయ రంగంలో అడుగు పెడుతూ స్వార్థపరులైన రాజకీయ నాయకులను కాపాడుతున్నారు. స్వార్థ రాజకీయ నాయకులను, నేరస్థులను రాజకీయాల్లోకి రాకుండా చూడగలిగినప్పుడే దీనికి అడ్డుకట్ట పడుతుంది. పేదలకు న్యాయం జరుగుతుంది. ఇది కేవలం ప్రజలవల్లే సాధ్యమవుతుంది. ప్రజలు ఓటునే ఆయుధంగా ఉపయోగించి స్వార్థపరులైన రాజకీయ నాయకులకు, నేర చరిత్ర ఉన్నవారికి గుణపాఠం చెప్పాలి. ఆ రోజులు త్వరలోనే వస్తాయని ఆశిస్తున్నాను.

- కృష్ణ సాగర్ రావు అధికార ప్రతినిధి, బిజెపి తెలంగాణ శాఖ