ఫోకస్

ఉపాధి అవకాశాలు లేకే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశంలో ఉన్నత విద్య సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది. నామమాత్రపు విద్యకే పరిమితమైన వారికి ఉపాధి అవకాశాలు కన్పించడం లేదు. స్వయం ఉపాధికోసం ఎంతగా ప్రయత్నించినా రుణ సదుపాయం లభించని స్థితి. దీంతో ఉన్నత విద్య పేరిట కేవలం ఉపాధికోసమే గత్యంతరం లేని స్థితిలో దళారుల ద్వారా విదేశాలకు వెళ్ళాల్సిన దుస్థితి ఏర్పడింది. కమిషన్‌కు కక్కుర్తి పడుతున్న దళారులు గుర్తింపు లేని విశ్వవిద్యాలయాలకు సైతం పంపించి చేతులు దులుపుకుంటున్నారు. కేవలం చదువుకోసం వెళ్లిన వారు కూడా అక్కడి స్టాండర్డ్‌ను అందుకోలేక కొందరు, ఇంటినుంచి రెండో విడత ఫీజు సొమ్ము రాక మరికొందరు తమ చదువులకు స్వస్తి చెప్పి అక్కడ కూలి పనులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. తక్షశిల, నలంద, సోమాపుర్ వంటి మహా విద్యాలయాలతో ప్రపంచానికే జ్ఞానభిక్ష పెట్టిన చారిత్రక ఘనత మనకున్నప్పటికీ కాలగమనంలో పాలకులు భౌతిక పెట్టుబడులపై దృష్టి సారించి కీలకమైన ఆరోగ్యం వంటి వాటిని నిర్లక్ష్యం చేయటం ప్రారంభించారు. నూట పాతిక కోట్ల జనవాళి గల భారతావనిని సమర్థ మానవ వనరుల మహా మండలంగా తీర్చిదిద్దగల చదువుల పునాది నేడు అన్ని స్థాయిల్లోనూ గుల్లబారిపోయింది. దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్, హాంకాంగ్ ప్రతి విద్యార్థినీ ఓ వజ్రంలా సానపడుతున్న తీరు అమోఘం. ఈ దేశంలో చదువుల సరస్వతి నిలయాలుగా ఎదగాల్సిన ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యా సంస్థలన్నింటినీ పాలకులు ఒక్క తీరుగా పాడుపెట్టి జాతికి ద్రోహం చేస్తున్నారనడంలో సందేహం లేదు

-దేవినేని అవినాష్, అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్