ఫోకస్

ఆందోళన తీవ్రతరం చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరి విద్యార్థి లోకాన్ని, సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఉంది. విద్యార్థులకు చేయూత ఇవ్వాలన్న సంకల్పం ప్రభుత్వానికి లేదనిపిస్తోంది. విద్యా రంగాన్ని పటిష్టం చేయాలన్న తలంపు అంతకంటే లేదు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండున్నర సంవత్సరాలయింది. ఫీజు బకాయిలు కేవలం 600 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయని, వీటిలో వెంటనే 300 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. గత ఏడాదికి సంబంధించిన బకాయిలే 1200 కోట్ల రూపాయలపైగా ఉన్నాయి. ఈ సంవత్సరం దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో చేరారు. వీరికి ఫీజు రీయింబర్స్ చేసేందుకు 2600 కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది. ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయడం లేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై విద్యార్థి సంఘాల తరఫున మేము ఆందోళన చేస్తే ప్రభుత్వం తప్పుడు ప్రచారానికి పూనుకుంటోంది. అవసరమైన నిధులు విడుదల చేయకుండానే విడుదల చేసినట్టు, ప్రైవేట్ యాజమాన్యాలకు విద్యార్థి సంఘాలు అండగా ఉంటున్నాయంటూ ప్రచారం చేస్తోంది.
నాణ్యమైన విద్యను అందిస్తామంటూ ప్రభుత్వం పదే పదే ప్రకనలు జారీ చేస్తోంది. నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటోంది? అన్న ప్రశ్న ఉద్భవిస్తోంది. సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయకపోతే ప్రైవేట్ కాలేజీల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బందికి వేతనాలు చెల్లించడానికి యాజమాన్యాలకు వీలుకాదు. దాంతో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు తదితర బోధనా సిబ్బంది ప్రైవేట్ కాలేజీల్లో పనిచేసేందుకు ఇష్టపడటం లేదు. పోనీ ప్రభుత్వ కాలేజీలనైనా ప్రభుత్వం పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకున్నారా? అంటే లేదనే చెప్పుకోవాలి. ప్రభుత్వ కాలేజీల్లోనైనా నాణ్యమైన విద్యను అందించేందుకు బోధనా సిబ్బందిని ఎందుకు నియమించడం లేదు? వౌలిక సదుపాయాలను ఎందుకు కల్పించడం లేదు? అని ప్రశ్నించుకుంటే వాస్తవాలు ఏమిటో వెల్లడవుతాయి. ప్రైవేట్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు బకాయిలకు అవసరమైన నిధులు ఎన్నో, విడుదల చేస్తున్నది ఎన్నో పారదర్శకంగా చెప్పలేరా? ప్రైవేట్ కాలేజీలను ఎయిడెడ్ కాలేజీలుగా మారుస్తారా? అలా మార్చినా బాగానే ఉంటుంది కదా! ఇవన్నీ ఏమీ చేయకుండా ప్రభుత్వం గాలి కబుర్లతో కాలం వెళ్లబుచ్చుతోంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళతామంటూ రాష్ట్ర ఐటి మంత్రి కె. తారకరామారావు చేసిన ప్రకటన, వాస్తవంగా ప్రభుత్వం చేస్తున్న పనులకు భిన్నంగా ఉంది. ఇకనైనా విద్యార్థులను, తల్లిదండ్రులను మభ్యపెట్టకుండా వాస్తవ లోకంలోకి ప్రభుత్వం వస్తే బాగుంటుంది. లేని పక్షంలో మేం ఉద్యమాన్ని పెద్దఎత్తున చేపడతాం.

- బి. సాంబశివ కార్యదర్శి, ఎస్‌ఎఫ్‌ఐ