ఫోకస్

ఒత్తిడి తెస్తాం.. విడుదల చేయిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యలతో ప్రస్తుతం అత్యంత ప్రధానమైనది విద్యార్థుల ఫీజు రీయంబర్స్‌మెంట్. దీనికి ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం దురదృష్టకరం. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రెండు విద్యా సంవత్సరాలు గడిచినా, ఇంకా 2014-15, 2015-16 విద్యా సంవత్సరాలకు సంబంధించిన ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. గత ఏడాది ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగిస్తూ ఫీజు రీయంబర్స్‌మెంట్ అద్భుతమైన పథకంగా అభివర్ణించారు. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిలుపుదల చేయకుండా కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులకే కాదు అధ్యాపకులకు, యాజమాన్యాలకూ ఇబ్బంది లేకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కూడా విడదల వారీగా ఫీజు రీయంబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయనున్నట్లు అసెంబ్లీలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆ తర్వాత కొంతమొత్తంలో విడుదల చేస్తున్నట్లు పత్రికా ప్రకటన వెలువడినా, నిధులు మాత్రం విడుదల కాలేదు. వివిధ విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావులు, కళాశాల యాజమాన్యాలు ఎన్నోసార్లు నిరసనలు, ప్రదర్శనలు, ధర్నాలు చేస్తున్నప్పటికీ ఈ ప్రభుత్వం పట్టించుకున్న పాపానపోలేదు.
ఇక ఈ ఏడాది 2016 సంవత్సరం మార్చి 29న అసెంబ్లీలో ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ 2014-15, 2015-16 వరకు విద్యార్థులందరికీ 3068 కోట్ల రూపాయల బకాయిలను ఏప్రిల్ నెలాఖరులోగా ఖచ్చితంగా విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ 1088 కోట్ల రూపాయలు మాత్రమే ఆర్థిక శాఖ నుంచి విడుదలైనప్పటికీ ఈ రోజు వరకు 278 కోట్ల రూపాయలకు టోకెన్స్ ఇచ్చి డబ్బులు ఇవ్వడం మరిచిపోయారు. ఈ నిధులు ఆగిపోవడం వలన 13,84,000 మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోంది. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం బాధాకరం. అందుకే యువజన కాంగ్రెస్ విద్యార్థులకు మద్దతుగా నిలిచింది. అంతేకాదు విద్యార్థులతోపాటు ఉద్యమాలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నది. రాష్ట్రంలోని అన్ని కళాశాలల విద్యార్థుల నుంచి ఫీజు రీయంబర్స్‌మెంట్ కోసం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టాం. ఫీజు రీయంబర్స్‌మెంట్ నిధులను విడుదల చేసి ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ విద్యార్థుల నుంచే సేకరించిన దరఖాస్తులను ముఖ్యమంత్రి కెసిఆర్‌కు అందజేస్తాం. ఒకవేళ ముఖ్యమంత్రి వాటిని స్వీకరించేందుకు అప్పాయింట్‌మెంట్ ఇవ్వని పక్షంలో గవర్నర్‌కు అందజేస్తాం. అదేవిధంగా డిసెంబర్ 2న జరిగే బహిరంగ సభలో ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి అందజేస్తాం, రాహుల్ గాంధీ వాటిని రాష్టప్రతికి అందజేస్తారు. ఫీజు రీయంబర్స్‌మెంట్‌కు ప్రభుత్వంపై అన్ని విధాలా వత్తిడి తెచ్చి నిధులు విడుదల చేయించి విద్యార్థులను ఆదుకుంటాం.

- ఎం. అనిల్‌కుమార్ యాదవ్ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్