ఫోకస్

ఇది ఎవరికి ‘ఉపకారం’?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు ప్రతిభ ఉన్న విద్యార్థులకు మాత్రమే ఉపకార వేతనం ఉండేది, దళితుల పిల్లలకు విద్య, అందులోనూ ఉన్నత విద్య అందుబాటులో ఉండేది కాదు, కాలక్రమంలో రాజకీయ పార్టీల వాగ్దానాలతో విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలులోకి వచ్చింది. నిరుపేద విద్యార్థులు సైతం ఉన్నత ప్రమాణాలున్న కళాశాలల్లో ధనవంతుల పిల్లలతో సమానంగా చదువుకునే అవకాశం కల్పించాలనే ఆశయంతో మొదలైనదే ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానం. ఫీజులు కట్టడానికి సరిపడా ఆర్థిక స్తోమత లేక చదువు మానేసిన వారిని దృష్టిలో ఉంచుకుని, కేవలం చదువు మానేయడానికి డబ్బు ఒక ప్రధాన కారణం కారాదనే భావనతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చారు. దీనిని ఒక సదుద్దేశంతో అప్పటి ప్రభుత్వం ప్రవేశపెట్టిందనడంలో ఎలాంటి సందేహం లేదు, అదో అవసరం, స్వాగతించదగినదే. అయితే ఒక మంచి ఆశయంతో మొదలుపెట్టిన ఈ ఉపకారం అనేక అవకతవకలతో వివాదాస్పదంగా మారిందనడంలో ఆశ్చర్యం లేదు. ఆర్థిక స్తోమతు లేని ప్రజా సమూహాల పిల్లలకు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రయత్నం చేస్తున్నవేళ ఉపకారం అవసరమే అనేది అందరి భావన. అయితే అది ఎంతవరకూ సక్రమంగా అమలు జరుగుతుందనేది పెద్ద ప్రశ్నార్థకం.
పదవ తరగతి వరకూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు ఉచితంగానే కొనసాగుతున్నందున, ఇంటర్మీడియట్ నుండి ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలులోకి వచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ, పిహెచ్‌సి విద్యార్థులకు అప్పటికే స్కాలర్‌షిప్‌లు, పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు అమలులో ఉన్నాయి. వీటన్నింటి గణాంకాలను పరిగణనలోకి తీసుకున్నపుడు దాదాపు 85 శాతం మంది విద్యార్థులు ఫీజు రాయితీలను పొందుతున్నపుడు మరో 15 శాతం మందికి విస్తరిస్తే ఏం అవుతుందిలే అనే భావనతో ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలులోకి వచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బిసి , పిహెచ్‌సి, మైనార్టీ విద్యార్థులు అడ్మిషన్ సమయంలోనే తమ ఫీజులను చెల్లించకుండా కులధ్రువీకరణ చూపిస్తే సరిపోతుంది. ఆర్థికంగా వెనుకబడిన మిగిలిన విద్యార్థులు అందుకు ఆధారాలు చూపించడం లేదా తొలుత చెల్లించిన పక్షంలో ప్రభుత్వం వారి బ్యాంకు ఖాతాలకు నేరుగా డబ్బులు చెల్లించడం అనే పద్ధతిలో ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలులోకి తెచ్చారు. అటుతర్వాత దానిలో అనేక మార్పులను తీసుకువచ్చారు. ఆర్థిక స్థితిని, ఇంజనీరింగ్ కోర్సుల్లో 10వేల ర్యాంకు వరకూ విద్యార్థులకే ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలుచేస్తున్నారు. సకాలంలో అందుకు అవసరమైన నిధులను విడుదల చేయకపోవడంతో ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ అనేది ఒక పెద్ద ప్రహసనంగా మారింది. ఆంధ్రాలో ఉన్న బకాయిలను చెల్లించి, తదుపరి దశకు చేరుకున్నా తెలంగాణలో మాత్రం పాత బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలకు ఇదో పెద్ద అస్త్రంగా మారింది. ఫీజు వాపస్ పథకం కింద బకాయిపడిన మొత్తాన్ని వెంటనే చెల్లించాలని అన్ని పార్టీలూ డిమాండ్ చేశాయి. దాదాపు 2600 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని యాజమాన్యాలు చెబుతుండగా, తక్షణం 600 కోట్లు విడుదల చేస్తామని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్వయంగా వెల్లడించారు. హామీ కాదని, వెంటనే డబ్బు విడుదల చేయాలని యాజమాన్యాలు కోరుతున్నాయి. ఇదంతా ఒక పార్శ్వం.
మరో పార్శ్వంలో విద్యార్థులకు చదువుపై ఆసక్తి లేకున్నా, ప్రభుత్వం ఫీజులు ఇస్తోంది కనుక ఏదో ఒక కాలేజీలో పేరు రాయించుకోవడం, హాజరు నుండి కాలేజీలతో మిలాఖత్ అయి మినహాయింపు పొందడం కొంతమంది విద్యార్థుల విషయంలో బహిరంగంగా జరుగుతుందనేది నిస్సందేహం. అంటే చదువు అక్కర్లేని విద్యార్థికి డిగ్రీ సర్ట్ఫికేట్‌కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కాలేజీకి అమ్ముకుంటున్న అర్థం వచ్చేలా పరిస్థితి మారిపోయింది. సీట్లు భర్తీకాని కాలేజీల ఏజెంట్లు కౌనె్సలింగ్ కేంద్రాల వద్దే ప్రత్యక్షమై విద్యార్థులను ప్రలోభ పెట్టి తమ కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకుంటున్నారు, దానికి కారణం ఆయా సీట్లు భర్తీ అయితే ఫీజు రీయింబర్స్‌మెంట్ వస్తుందనే ఆశ అనేది సుస్పష్టం. ఈ క్రమంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కొందరు ప్రముఖుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.