ఫోకస్

ముస్లిం మహిళల భద్రతకు ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచం చాలా విశాలమైంది. జీవించే హక్కు ప్రతి ప్రాణికీ ఉంది. విభిన్న జాతులు, వర్గాల ప్రజలు జీవిస్తున్న భారతదేశం మంచి సంస్కృతీ, సంప్రదాయాలను కలిగి అభివృద్ధి చెందుతోంది. ఉమ్మడి సివిల్ కోడ్‌లో భాగంగా ‘ట్రిపుల్ తలాఖ్’ సమస్య ముస్లిం మహిళల భద్రతకు ముప్పు వాటిల్లుతోంది. పురాతన కాలంలో రాజుల పాలన ఉండేది. రాజ్యాలు ఎక్కువగా ఉండేవి. తరచూ యుద్ధాలు జరిగేవి. ఆ యుద్ధాల్లో ప్రజలు చనిపోతూ ఉండేవారు. తక్కువ వయస్సులోనే మహిళలు వితంతువులుగా మారేవారు. దీంతో కుటుంబ పోషణార్థం కొందరు మహిళలు భిక్షమెత్తుకోవడమో.. వ్యభిచార రొంపిలోకి దిగడమో.. చోరీలకు పాల్పడమో జరిగేది. అలాంటి సమయాల్లో రాజులు గానీ, ప్రజలు కానీ వారికి కుటుంబ పోషణ వరకు వనరులు కల్పిస్తూ కాలక్రమేణ వారిని వివాహం చేసుకునేవారు. అయితే దీన్ని సాకుగా చేసుకొని కొందరు మతఛాందస వాదులు ఒక ముస్లిం ఎంతమంది మహిళలనైనా పెళ్లి చేసుకోవచ్చని, మూడు సార్లు తలాఖ్.. తలాఖ్.. తలాఖ్ అంటూ విడాకులు ఇచ్చేయవచ్చని ఒక ఫత్వాను జారీ చేసుకున్నారు. కానీ ఇప్పుడు సమాజం మారింది. సమాజంలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. నాగరికత పెరిగి సాంకేతిక పరిజ్ఞానంతో భారత్ ముందుకెళ్తోంది. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. తలాఖ్‌వల్ల ముస్లింల స్వేచ్ఛకు, భద్రతకు ప్రమాదం ఏర్పడింది. అందుకే కొందరు ముస్లిం మహిళా సంఘాలు ట్రిపుల్ తలాఖ్‌ను రద్దు చేయాల్సిందేనంటూ సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించారు. ఇంకా ఈ సమస్య కోర్టు విచారణలోనే ఉంది. కేంద్ర ప్రభుత్వం ట్రిపుల్ తలాఖ్‌పై బాగానే స్పందిస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయంతో కాకుండా ముస్లిం మతపెద్దలతో సంప్రదింపులు జరిపి, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలి. ముస్లిం మహిళల భద్రతకు చట్టబద్ధత కల్పించాలి.

- పాండురంగారావు లోక్‌సత్తా, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు