ఫోకస్

ఉద్దేశం మంచిదే..అమలులోనే లోపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నోట్లను రద్దుచేయడం వెనుక ఉద్దేశం మంచిదే అయినప్పటికీ, అమలు చేసేందుకు చేపట్టిన విధానం మాత్రం సరైంది కాదు. భారతదేశంలో కొంతమంది బడాబాబుల వద్ద పేరుకుపోయిన నల్లధనాన్ని వెలికితీయాలని ప్రభుత్వం భావించడంలో తప్పులేదు. దేశంలో ప్రతి పౌరుడి ఆదాయం చట్టానికి లోబడి ఉండాలన్నది కేంద్రం ఉద్దేశంగా స్పష్టమవుతోంది. నీతివంతమైన పాలనను ప్రజలకు అందించాలన్నది ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచించి ఉండవచ్చు. దేశానికి నీతివంతమైన, పారదర్శకమైన పరిపాలన అవసరమే. దేశంలో 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు కలిపి మొత్తం కరెన్సీలో 86 శాతం వరకు ఉంటుందని అంచనా వేశారు. ఈ మొత్తం 40 లక్షల కోట్ల నుండి 50 లక్షల కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఇందులో ఇప్పటివరకు వెలుగులోకి వచ్చింది కేవలం 16 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే. మిగతా దాదాపు 30 లక్షల కోట్ల రూపాయలు నల్లకుబేరులు హవాలాద్వారా బయటి దేశాలకు మళ్లించారు. అంటే ప్రభుత్వ ఉద్దేశం మంచిదే అయినప్పటికీ, దానివల్ల మంచి ఫలితాలు మాత్రం రాలేదు. పెద్దనోట్ల రద్దు ప్రకటన తర్వాత దేశంలో ప్రజలంతా ఇక్కట్లకు గురయ్యారు. కులం, మతం, బాషా తదితర భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ, ప్రతి కుటుంబం ఇబ్బందిపడుతోంది. డబ్బు విత్‌డ్రా చేసుకునేందుకు బ్యాంకులకు ఎవరు వెళ్లినా 2000 రూపాయల నోట్లు ఇస్తున్నారు. దీన్ని మార్చుకునేందుకు వీలుకావడం లేదు. అంటే పెద్దనోట్ల రద్దు నిర్ణయం వెనుక సరైన ప్రణాళిక లేదనిపిస్తోంది. ముందుగానే దేశంలోని అన్ని బ్యాంకుల్లో అవసరమైన మేరకు నిధులను 100, 500, 2000 రూపాయల నోట్ల రూపంలో ఉంచితే ఇబ్బందులు తలెత్తేవి కాదు. బ్యాంకుల్లోనూ, ఎటిఎంల వద్ద పెద్ద పెద్ద క్యూలైన్లు ఏర్పాటయి ఉండేది కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా గత 25 రోజుల నుండి పన్నుల రూపంలో లభించాల్సిన డబ్బు రావడం లేదు. ఈ పరిస్థితి మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉంది. చిన్న, మధ్యతరహా వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు నిధుల లేమితో ఇక్కట్లకు గురవుతున్నారు. ప్రభుత్వం పార్లమెంట్‌లో తాజాగా ప్రతిపాదించిన చట్టం కొంతవరకు వెసులుబాటు కలిగిస్తోంది. మొత్తం డిపాజిట్ చేస్తే అందులో 50 శాతం పన్నుగా వేస్తామని వెల్లడించారు. ఈ నిధుల వినియోగానికి ప్రణాళిక రూపొందించారు. పెద్దనోట్లను రద్దుచేసే ముందే పక్కా ప్రణాళికను రూపొందించి, అమలు చేసి ఉంటే బాగుండేది.

- ఎస్. రామచంద్రరావు మాజీ అడ్వకేట్ జనరల్, ఆంధ్రప్రదేశ్