ఫోకస్

సవాళ్లు దురదృష్టకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే పండుగలపై పంచాంగకర్తలు, మఠాధిపతులు, పీఠాధిపతుల మధ్య విభేదాలు నెలకొనటం ఒక ఎత్తయితే మీడియాద్వారా బహిరంగ సవాళ్ళకు దిగటం దురదృష్టకరం. దీనివల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. తెలుగువారి తొలి పండుగ ఉగాది తేదీలపై వివాదం నెలకొనటం బాధాకరం. కంచిపీఠం 28న ఉగాది అని చెపుతుండగా, 29నే ఉగాది అని టిటిడి, పుష్పగిరి పీఠం, విశాఖ శ్రీ శారదా పీఠం, శృంగేరీ పిఠం చెబుతున్నాయి. అయితే ఏ పంచాంగకర్తయినా గణాంకాల ప్రకారమే తిథులు ముఖ్యంగా పర్వదినాలను నిర్ణయిస్తున్నారు. అసలు ఈ జోతిష్యంపై కోర్సులు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మాత్రమే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ కోర్సులను అధికారంగా నిర్వహిస్తోంది. ఈ విశ్వవిద్యాలయాల్లో అభ్యసించినవారినుండి ఏకాభిప్రాయాన్ని స్వీకరించి, ప్రభుత్వం ఆ రోజునే ఉగాదిగా ప్రకటిస్తే సమచితంగా ఉంటుంది.

- కప్పగంతుల సుబ్బరామ సోమయాజులు, పంచాగకర్త