ఫోకస్

పూర్వ పద్ధతి ప్రకారం 29నే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్ధాంతగ్రహచారేణ వ్రతధర్మాదికం చరేత్‌
దృక్సిద్ధగ్రహచారేణ హోరాఫలముదీరయేత్‌॥
ప్రత్యహం తిథినక్షత్ర యోగస్వానయనే విదుః
అబీజిసంస్కృతోగ్రహ్యః గ్రహణదౌసబీజకః॥
(సూర్యసిద్ధాంత సారసంగ్రహము)
రవి, చంద్ర గ్రహణములు, గ్రహముల ఉదయాస్తమయ, వక్ర, వక్రత్యాగ గ్రహయుద్ధ, పాతాది ప్రత్యక్ష ఫలములకు దృక్సంస్కారకృత రవిచంద్రుల గుణింపవలయును. అప్రత్యక్ష ఫలములగు వ్రతాది ధర్మనిర్ణయములందు మూలసిద్ధాంత సమ్మతమగు దృక్సంస్కారము చేయని రవి, చంద్రులచే గుణింపబడిన తాథ్యాదులు వాడవలయునని ధర్మనిర్ణయ వేదులగు పూర్వాచార్యులు తమనిర్ణయ గ్రంథములలో వ్రాసియున్నారు. ఆప్రకారమే మూలసిద్ధాంతానుసారులు గణకానంద, అగహలాఘవాది తంత్ర కరణ గ్రంథోక్త రీతులచే గుణింపబడిన పంచాంగము అనాదిగా అన్ని కార్యములందు ఉపయోగించుచున్నారు. కావున ఉగాది నిర్ణయము, శిష్టాచారసమ్మతమగు పూర్వపద్ధతి రీత్యానే పండగ నిర్ణయించడమైనది. కావున ఉగాది 2017 మార్చి 29 న బుధవారం రోజుననే జరుపుకొనుట శాస్తస్రమ్మతం. దృక్ పద్ధతి, పూర్వ పద్ధతి అని రెండు విధానాలున్నాయి. దృక్ పద్ధతిలో మార్చి 28న ఉగాది నిర్వహించాలి అని చెబుతున్నారు. పూర్వ పద్ధతి ప్రకారం మార్చి 29న ఉగాది నిర్వహించాలి. ఉభయ రాష్ట్రాల్లో అన్ని ఆలయాల్లోనూ పూర్వ పద్దతిలో మార్చి 29న ఉగాది నిర్వహిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీశైలం వంటి ప్రధాన ఆలయాలు అన్నింటిలో మార్చి 29న ఉగాది జరుపుకోనున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కూడా మార్చి 29న ఉగాది జరుపుకోనున్నాయి. కంచి స్వామి వారు దృక్ పద్ధతి ఆచరిస్తారు. మార్చి 28న ఉగాది నిర్వహిస్తారు. నేను ఒక పంచాంగ కర్తను, మార్చి 29న ఉగాది జరుపుకోవాలని పంచాగంలో రాశారు. మీరు 28న ఉగాది అంటున్నారు అని నేను కంచి స్వామిని అడిగాను. 29న ఉగాది పండుగ చేసుకోవచ్చు అని కంచి స్వామి చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి, శ్రీశైలం ఆస్థాన సిద్ధాంతి 29న ఉగాది అని చెప్పారు. ‘‘అభీజ స్కృంతో గ్రాహ్యః గ్రహణాదౌస భీజకః’’ అని శాస్త్రం చెబుతోంది. దృక్ పద్ధతి, పూర్వ పద్ధతి అని రెండు విధానాలు ఉండడం వల్లనే పండుగల సందర్భంలో ఏ రోజు పండుగ అనే చర్చ జరుగుతోంది. చాలాకాలం క్రితం కేంద్ర ప్రభుత్వం ఈ వివాద పరిష్కార్కానికి ప్రయత్నం చేసింది. గ్రహాలకు సంబంధించి ప్రత్యక్షంగా కనిపించని వాటికి దృక్ పద్ధతి వాడాలి. అప్రత్యక్షమైనవి పండుగల వంటి వాటికి పూర్వ విధానం వాడాలి. ఈ రెండు విధానాలు అనుసరించదగినవే. అయితే దేనికి ఏ విధానం వాడాలి అనేది ముఖ్యం. పూర్వ విధానం ప్రకారం ముమ్మాటికీ మార్చి 29నే ఉగాది. శిష్టాచార సమ్మతం ప్రకారం పూర్వ పద్ధతి ప్రకారమే పండుగలను నిర్ణయించారు.

- యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి పంచాంగకర్త