ఫోకస్

జీవోల నిలుపుదల తొందరపాటు చర్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 8వ తేదీన జారీ చేసిన జీవో 13, గత సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో జారీ చేసిన ఆరు జీవోలను తాత్కాలికంగా నిలుపుదల చేసింది. ఇది పూర్తిగా తొందరపాటు నిర్ణయం. దేవాదాయ శాఖను ప్రక్షాళన చేసి వౌలిక సంస్కరణలు తేవాలనే ధార్మిక పరిషత్ సూచనలకు కార్యరూపం ఇవ్వాలని చేసిన ప్రయత్నాన్ని నిర్వీర్యం చేయడమేనని చెప్పాలి. దేవాదాయ శాఖలోని ఉద్యోగులు వారికి అవసరం లేని, సంబంధంలేని విషయాల్లో మితిమీరి జోక్యం చేసుకుంటున్నారు. ఇదంతా ధార్మిక పరిషత్‌ను శాశ్వతంగా అడ్డుకోవడం కోసమే. ఈ పరిషత్ ఏర్పాటు కాకుండా అడ్డుకునేందుకు జీవోలను సుప్తచేతనావస్ధలో పెట్టారు. రాష్ట్రంలోని దేవాలయాలకు జవసత్వాలు అడ్డుకుంటే దేవాదాయ శాఖ ప్రజాగ్రహాన్ని ఎదుర్కొనాల్సి వస్తుంది. ఉద్యోగులు వారి విధులు వారు చేసుకోకుండా పాలనా పరిధిని దాటి శాసన నిర్మాణాన్ని ప్రభావితం చేసే దిశగా అడుగులు వేయడం ఉద్యోగులకు తగదు. పరిమితులు దాటి దేవాలయాలపై పెత్తనం చేయాలని చూస్తే దేవాదాయ శాఖ ఉనికి కూడా లేకుండా పోతుంది. ఇకనైనా ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మానకపోతే దేవాదాయ శాఖ అస్విత్వం ప్రమాదంలో పడుతుంది. ధార్మిక పరిషత్‌ను ఎటువంటి అవాంతరాలు లేకుండా వెంటనే ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. దేవాలయాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రభుత్వం రక్షించాలి. ప్రభుత్వం ముందు తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలి. ధార్మిక పరిషత్ వల్ల హైందవ సంస్కృతి పరిఢవిల్లుతుంది.

- అగ్నిహోత్రం ఆత్రేయ బాబు ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య