ఫోకస్

నిర్వహణ ప్రభుత్వమే చేపట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్న చిన్న దేవాలయాల నిర్వహణ బాధ్యత పూర్తిగా ప్రభుత్వం తీసుకోవాలి. అప్పుడే వాటికి మనుగడ ఉంటుంది. ముఖ్యంగా ఆలయాల విషయం, హిందూ ధర్మ పరిరక్షణ గురించి చెప్పాలంటే ప్రతి ఒక్కరిలో ధర్మ ప్రచారం అనేది చాలా అవసరం. ఈ ధర్మ ప్రచారం ద్వారానే ఆలయాల విశిష్టత, హిందూ మత పరిరక్షణ జరుగుతుంది. మతమార్పిడులు యధేచ్చగా సాగుతున్నాయి. వీటిని అడ్డుకోవాలంటే ప్రతి ఆలయంలో ఉన్న అర్చకుడి నుంచి మొదలుకుని సిబ్బంది వరకు ధర్మప్రచారంలో ఐక్యంగా పాల్గొనాలి. అప్పుడే హిందుత్వం నిలబడుతుంది. ఇక ఆలయాలు, మఠాలు, పీఠాల అభివృద్ధి జరగాలంటే వాటికి ఉన్న వందల ఎకరాల భూములు వాటికే చెందాలి. తద్వారా వచ్చే ఆర్థిక ఫలాలు ఆయా పీఠాలు, ఆలయాలకే చెందాలి. అప్పుడే అవి అభివృద్ధి చెందుతాయి. వందల ఎకరాలు చాలాచోట్ల అన్యాక్రాంతమయ్యాయి. వీటిని సక్రమంగా వాడుకోవాలి. ఆదిలాబాద్ జిల్లాలో గోపాలకృష్ణ మఠానికి దాదాపు 2 వేల ఎకరాలు, నిజామాబాద్ జిల్లా కందకుర్తి రామాలయానికి 2 వేల ఎకరాలు, మహబూబ్‌నగర్ జిల్లా హంపీ పీఠానికి 1500 ఎకరాలు భూములు ఉంటే అవి ఏమయ్యాయో, ఎవరి చేతుల్లో ఉన్నాయో తెలియని పరిస్థితి. హంపీ పీఠం భూముల్లో కొంత అటవీ శాఖ ఆక్రమించుకున్నట్లు తెలిసింది. ఇలా వందల ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయి. వీటిని పరిరక్షించాలంటే పకడ్భందీ చట్టం తేవాలి. ఉమ్మడి జట్టుగా పనిచేసి సాధించాలి. ముఖ్యంగా ఆలయాలంటే యాగం, శాస్త్రం సంబంధించిన అంశాలు. ఇప్పటితరం యువతకు వీటిపై అవగాహన లేదు. కాబట్టి ఇప్పుడున్న ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్‌ఎస్ మాదిరిగా ఎండోమెంట్ సర్వీస్ అనే కొత్త సర్వీస్‌ను ప్రవేశపెట్టాలి. ఆ సర్వీస్‌కు వేదం, ఆగమశాస్త్రం తదితర అంశాలపై అవగాహన కలిగి ఉండి, సంస్కృతంపై పట్టు ఉన్న యువతను ఎంపిక చేసి శిక్షణ ఇవ్వాలి. అప్పుడే దేవాలయాలు, హిందూ ధర్మపరిరక్షణ వంటివి పటిష్టంగా అమలు చేసేందుకు వీలవుతుంది. ఇక అర్చకుల పరిస్థితి చాలాచోట్ల దారుణంగా ఉంది. చాలీచాలని జీతభత్యాలు కలిగి ఉన్నారు. దేవుడిని నిత్యం పూజించే పూజారికే ఆహారం కొరతగా ఉంటే అంతకన్నా ఘోరం ఏం కావాలి. ఆలయాన్ని పరిరక్షించే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కన్నా, దేవుడిని నిత్యం పూజించే అర్చకుడికి ప్రాధాన్యత ఉండాలి. అధికారికి ఇచ్చే జీతం కన్నా అర్చకుడికి ఇచ్చే జీతం ఒక రూపాయి ఎక్కువగా ఉండాలి. అప్పుడే అర్చకుడికి ప్రాధాన్యత ఉంటుంది. లేకపోతే అర్చకులు అధికారులకు అటెండర్లుగా మారుతున్నారు. దేవాలయాల విశిష్టతను కాపాడకుండా ఇష్టానుసారంగా ఆలయాల్లో డిసెంబర్ 31న కేక్‌లు కట్ చేయడం, అర్ధరాత్రి ఆలయాలు తెరవడం వంటివి కొందరు చేస్తున్నారు. ఇలాంటివి చేసేందుకు ఎవరు అధికారమిచ్చారు. ఇలాంటివి ఆపాలి.
- ఆకారపు కేశవరాజు
విశ్వ హిందూ పరిషత్
తెలంగాణ విభాగం
సంస్థాగత కార్యదర్శి

- ఆకారపు కేశవరాజు విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ విభాగం సంస్థాగత కార్యదర్శి