ఫోకస్

ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఆలయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఉపయోగపడాలి. ప్రతి గ్రామంలోని దేవాలయాన్ని ఈ విధంగా తీర్చిదిద్దాలి. ప్రస్తుతం ఎపి దేవాదాయ పరిపాలన కోసం ఉన్న చట్టాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఇటీవల రెవెన్యూ (దేవాదాయ) శాఖ జారీ చేసిన జీఓలపై ఆందోళన అవసరం లేదు. అవసరం అయితే జీఓల్లో మళ్లీ మార్పులు చేసుకుని కొత్త జీఓలను రూపొందించుకోవచ్చు. జీఓ ఏదైనా అది హిందూ ధర్మాన్ని కాపాడేది అయి ఉంటే చాలు. దేవాలయాల్లో పనిచేసే వారికి హిందూమతం గురించి, ఆగమ శాస్త్రం గురించి, సనాతన ధర్మం గురించి తెలిసి ఉండాలనడంలో తప్పేమిటి? దేవాలయాల్లో పనిచేసే ఉద్యోగులను మతపరమైన ఉద్యోగులు, లౌకిక ఉద్యోగులు (ప్రభుత్వ ఉద్యోగులు) అంటూ విభజించాల్సిన అవసరం లేదు. ఏ ఉద్యోగికి అయినా వేతనం ఆలయాల ఆదాయం నుండే చెల్లిస్తున్నారు. భక్తులు దేవుడి పేరుతో చెల్లించే నిధుల నుండే అందరికీ వేతనాలు ఇస్తున్నారు. వీరంతా హిందూధర్మ పరిరక్షణ కోసం పనిచేయాల్సిందే. దేవాదాయ, ధర్మాదాయ చట్టం వాస్తవంగా 1933లో రూపొందింది. దీనికి 1951లో ఒక పర్యాయం, 1966లో మరొక పర్యాయం సవరణ చేశారు. 1979లో తిరుమల తిరుపది దేవస్థానాలకోసం ప్రత్యేక చట్టం రూపొందించారు. చల్లా కొండయ్య సిఫార్సుల మేరకు 1986లో ఎండోమెంట్స్ చట్టానికి సవరణలు చేశారు. మళ్లీ 2007లో సవరణలు చేశారు. దేవాలయాల పరిపాలన కోసం ధార్మిక పరిషత్ ఏర్పాటుకు 2007 చట్టసవరణ ప్రధానమైంది. ధార్మిక పరిషత్‌కు అధికారాలు ఉండటంలో ఎలాంటి తప్పూ లేదు. ఇప్పటివరకు ఆలయాల ఆస్తులు-వాటి నిర్వహణ, ఆదాయం-వ్యయంపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తూ వస్తున్నారు. భక్తులకు సౌకర్యాలు, ఆసుపత్రుల నిర్వహణ, విద్యాలయాల నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే సనాతన ధర్మ రక్షణపై ఎలాంటి శ్రద్ద ఉండటం లేదు. 1966లో జరిగిన దేవాదాయ చట్టంలో టిటిడి నిధుల నుండి స్వల్పంగా హిందూ ధర్మరక్షణకు కేటాయించారు. అయితే ప్రస్తుతం సమాజంలో ఏర్పడి ఉన్న పరిస్థితిలో హిందూధర్మ పరిరక్షణ, హిందూమత పరిరక్షణపై దృష్టి కేంద్రీకరించాల్సి ఉంది. హిందువులు ఇతర మతాల్లోకి మారకుండా ఎలాంటి ప్రయత్నం జరగడం లేదు. ఈ అంశంపై చర్చించేందుకే ఇటీవల తిరుపతిలో ధార్మిక సదస్సు ఏర్పాటు చేశాం. ఈ సదస్సులో చేసిన తీర్మానాలను అమలు చేయడం ప్రారంభించాం.

- పివిఆర్‌కె ప్రసాద్, ఐఎఎస్ (రిటైర్డ్), చైర్మన్, హిందూధర్మ పరిరక్షణ ట్రస్ట్