ఫోకస్

అది... ఓడినవారి మాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికల్లో అక్రమాలను అడ్డుకుని ధన ప్రభావాన్ని, ప్రాంత ప్రభావాన్ని, కుల ప్రభావాన్ని, మత ప్రభావాన్ని తగ్గించాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకుంటున్న చర్యల్లో పెద్ద నోట్ల రద్దు ఒక పెను సంచలన నిర్ణయం. డబ్బుతో గెలవగలమని అనుకునే పార్టీలకు, వ్యక్తులకు, ప్రభావితం చేసే సంస్థలకు ఈ నిర్ణయం ధీటైన సమాధానం ఇచ్చింది. రానున్న ఎన్నికల్లో ప్రతి సందర్భంలో అభ్యర్థి వెచ్చించే నగదుకు లెక్క ఏర్పడుతుంది. రెండు లక్షలకు మించి ఖర్చు చేయాల్సి వచ్చినా, దానికి లెక్కలు చెప్పాల్సి ఉంటుంది. అంతేకాదు పార్టీలకు అందే నిధులపై కూడా ప్రధాని ముకుతాడు వేశారు. ఎవరైనా ఆన్‌లైన్‌లోనే చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. వాస్తవికంగా ఏ పార్టీకైనా డబ్బు ఇవ్వాలనుకునే వారికి భద్రత ఉంటుంది, అక్రమ పద్ధతిలో నగదు పొందే పార్టీలపైనా, అక్రమార్కులపైనా గట్టి నిఘా ఉంటుంది. దీనివల్ల ఎన్నికల్లో నగదు ప్రభావం పూర్తిగా తగ్గి సహజ వాతావరణం ఏర్పడేందుకు వీలుకలుగుతుంది. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడటం అలవాటైన పార్టీలకు ఇదో పెద్దదెబ్బగా పరిగణించవచ్చు. ఇక ఎన్నికల ఓటింగ్ యంత్రాల విషయానికి వస్తే ఏ పార్టీ అయినా ఎన్నికల్లో ఓడిపోతే ఓటింగ్ యంత్రాల్లో ఏదో జరిగిందని ఆరోపించడం అలవాటుగా మారింది. గెలిచినవారు ఓటింగ్ యంత్రాల్లో ఏదో జరిగి తాము గెలిచినట్టు ప్రకటించుకోరు... కాని వోటమి పాలైనవారే ఎందుకు ఆరోపిస్తోరో అర్థం కాదు. ఇటీవల పంజాబ్ ఎన్నికల్లో, యుపి ఎన్నికల్లో వంత పాడుతూ ఓటింగ్ యంత్రాల అక్రమాలపై ఎలుగెత్తిన పార్టీలకు ఈ యంత్రాలను ప్రవేశపెట్టింది గతంలో అధికారంలో ఉన్న పార్టీయేనని తెలియదా? ఇపుడే ఓటింగ్ యంత్రాల్లో అక్రమాలు కనిపిస్తున్నాయా? ఎలక్ట్రానిక్ సాఫ్ట్‌వేర్‌తో పనిచేసే ఓటింగ్ యంత్రాల్లో ఎలాంటి అక్రమాలకు తావు లేదు. అక్రమార్కుల ఆటలు సాగకపోవడంతో ఏదో వంక పెట్టుకుని ఇపుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల గురించి మాట్లాడుతున్నారు. విపక్షాల సభ్యులు గెలిస్తే ఒక మాట, ఓడితే మరో మాట అందరికీ తెలిసిందేగా.

- ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ శాసనసభ్యుడు, బిజెపి, తెలంగాణ