ఫోకస్

హిందువుల ఆగ్రహం చవిచూడాల్సి వస్తుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రంలో దేవాలయాల వ్యవస్థను ప్రభుత్వం వ్యాపార, వాణిజ్య పరంగా మార్చింది. కోవెల (దేవాలయం) లలను వర్తకంలా వినియోగిస్తున్నారు. ప్రసాదాని కో‘వెల’, దర్శనాని కో‘వెల’, పూజ కో‘వెల’, తీర్థాని కో‘వెల’గా మార్చడంతో హిందూ సమాజం అట్టుడికిపోతోంది. ఈ తీరును మార్చుకోకపోతే కచ్చితంగా హిందూ సమాజం ప్రతిఘటనను ప్రభుత్వం ఎదుర్కోవలసి ఉంటుంది. పూర్వకాలంలో రాజులు ఆలయాలను కట్టించేవారు, పాతవాటిని పునరుద్ధరించేవారు, పటిష్టం చేసేవారు. భగవంతుడికి నిత్యం ధూప దీప నైవేద్యాలు కొనసాగేలా ఏర్పాట్లు చేసేవారు. నేడు మన ప్రభుత్వాలు ఖజానా నుండి ఆలయాలకు నిధులు ఇవ్వకపోగా, పెత్తనం చలాయిస్తున్నాయ. రాజకీయ పునరావాస కేంద్రాలుగా ఆలయాలను మార్చివేశారు. రాజకీయ దివాళాకోరు తనానికి దీన్ని నిదర్శనంగా చెప్పుకోవచ్చు. హిందూ ఆలయాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం శోచనీయం. ఒకవైపు లౌకిక ప్రభుత్వం అంటూ, మరోవైపు హిందూ దేవాలయాలపై జోక్యం చేసుకోవడం ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వ విజ్ఞతను శంకించాల్సి వస్తోంది. మసీదులు, చర్చిల వైపు కనె్నత్తి కూడా చూడని ప్రభుత్వం కేవలం హిందూ దేవాలయాలపైనే పెత్తనం చెలాయించడం ధ్వంధ్వ విధానానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు. మక్కా వెళ్లే ముస్లింలకు, జెరూసలేం వెళ్లే క్రిస్టియన్లకు రవాణా చార్జీలలో రాయితీలు ఇస్తూ, విమానాశ్రయాల్లో హజ్ టర్మినల్ అంటూ ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం హిందువుల పట్ల సాచివేత ధోరణి కనబరుస్తోంది. పుష్కరాల సమయంలో, పర్వదినాల సమయంలో ఆర్టీసి బస్సు చార్జీలను పెంచుతూ, హిందువుల నుండి అదనపు నిధులను వసూలు చేస్తోంది. ఆలయాల్లో భక్తులు సమర్పించుకునే నిధులను సంక్షేమ ఫండ్, పరిపాలనా ఫండ్ పేరుతో పన్నుల్లా రాబట్టి, ప్రభుత్వ సిబ్బందిగా చలామణి అవుతున్న దేవాదాయ ఉద్యోగులకు వేతనాలు తదితర ఖర్చులకోసం వెచ్చిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఎండోమెంట్స్ పరిధిలోని దాదాపు ఎనిమిదివేల దేవాలయాలు ధూపదీప నైవేద్యాలకు నోచుకోవడం లేదు. మరికొన్ని దేవాలయాల పరిస్థితి కూడా ఇలాగే దిగజారే అవకాశం ఉంది. దేవాలయ భూములను హిందూ ధార్మిక కార్యక్రమాల కోసం వినియోగించాల్సి ఉన్నా, రాజకీయ నేతల కబంధ హస్తాల్లో నలిగిపోతున్నాయి. ఎకరానికి ఏటా రూ.100, రూ.50 మాత్రమే ఈ నేతలు చెల్లిస్తున్నారు. వాస్తవంగా దేవాలయాల ఆస్తులను, భూములను గోశాలలు, వేదపాఠశాలలు, గురుకులాలు, అన్నదానం తదితర అవసరాలకోసం వినియోగించాలి. ఆలయ భూముల్లో మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్‌లు, సినిమాథియేటర్లు, మద్యం దుకాణాలు, మాంసం దుకాణాలు వెలుస్తున్నాయి. ఇది ప్రభుత్వ ఒంటెద్దుపోకడకు నిదర్శనం కాదా? ఆలయాల ఆదాయాన్ని అనుసరించి ఎ, బి, సి క్యాటగిరీలుగా విభించారు. ఆదాయమే ప్రధానంగా చూస్తున్న ప్రభుత్వం సనాతన ధర్మం కాపాడేందుకు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. దాంతో హిందూ సమాజం నుండి ప్రతిఘటన ఎదుర్కోక తప్పదని హెచ్చరించాల్సి వస్తోంది.

- స్వామి పరిపూర్ణానంద శ్రీపీఠాధిపతి కాకినాడ.