ఫోకస్

భక్తి, పవిత్రతే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవాలయాల్లో పవిత్రత, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. రాష్ట్రంలో దేవాలయాల స్థితిగతులు వాటి పరిరక్షణకోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం. దేవాలయాల్లో ఉద్యోగుల వస్తధ్రారణకు నిబంధనలు విధించాం. తెల్లని దుస్తులు, తిలకం ధరించాలని ఆదేశాలిచ్చాం, దేవాలయాల్లో పరిశుభ్రమైన వాతావరణం కల్పించడంలో కృతకృత్యులయ్యాం. రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాల్లో అన్నదానం జరిగేలా ఇపుడు చర్యలు చేపట్టాం, పెద్ద, పెద్ద దేవాలయాల్లో 5వేల మందికి పైగా భక్తులకు అన్నదానం జరిగేలా ఆదేశాలిచ్చాం, అంతేకాదు దేవాలయ ఆస్తులు పరిరక్షణ- ఆదాయం పెంపుదలకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. రాష్ట్రంలో దేవాలయాల ఆస్తులు తక్కువ అద్దెతో, లీజుతో ఒకే వ్యక్తులు అనుభవిస్తున్న పరిస్థితులు ఉన్నాయి, వాటిని గమనించి లీజుల వ్యవహారంపై కూడా చర్యలు తీసుకున్నాం. 3 సంవత్సరాలకు షాపులు, పొలాలు గత 40, 50 సంవత్సరాలుగా ఒకే వ్యక్తులు నామమాత్రపు లీజు, అద్దెలతో అనుభవిస్తున్నారు, ఇక మీదట వేలం పాటలు జరిగేలా చర్యలు చేపట్టాం. సింహాచలం దేవస్థానం మాదిరిగా వేలాది ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. అర్బన్ ప్రాంతంలో ఉన్న దేవాదాయ శాఖ స్థలాలు బీవోటీ సిస్టంలో 33 సంవత్సరాల కాల వ్యవధితో లీజుకు ఇవ్వడానికి ఈ-టెండర్లు, ఓపెన్ ఆక్షన్ ఏర్పాటు చేశాం. ఈ విధానంతో ఆక్రమణలకు గురికాకుండా ఉంటుందని భావిస్తున్నాం. ప్రతి సంవత్సరం 10 శాతం లీజు పెంచాలని నిర్ణయించాం. రిటైర్డు జడ్జిలు, రిటైర్డు ఐఏఎస్ అధికారులతో ఆర్టీసీలో ఉన్న భూముల లీజు బీవోటీ సిస్టంపై సమీక్షించి ఈ నిర్ణయం తీసుకుని జీవో తయారు చేశాం. గ్రామీణ ప్రాంతాల్లో కూడా వ్యవసాయ భూములు దేవాదాయ శాఖకు ఉన్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో చేపల చెరువుల మధ్య పంటభూములు ఉండటంతో నిరుపయోగంగా మారాయి. ఈ భూములను 11 సంవత్సరాలు చేపల చెరువులకు లీజుకు ఇవ్వడానికి వేలం నిర్వహించాం. రూ. 20 నుంచి 25 వేలు ఎకరానికి పాట పలుకుతోంది. దేవాలయాలు-సిబ్బంది విషయంలో కూడా ప్రత్యేక దృష్టి సారించాం. దేవాలయాల్లో సిబ్బంది పూర్తిగా హిందూ మతస్తులే ఉండాలని నిర్ణయించాం. దేవాదాయ శాఖలో పనిచేసేవారికి బిఎల్ తప్పనిసరి అనే నిబంధన సరికాదని భావిస్తున్నాం. జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహశిల్దారు వంటి అధికారులే మెజిస్ట్రేట్‌లుగా ఉన్నప్పటికీ బిఎల్ లేకున్నా వారు విధులు నిర్వహిస్తున్నారు కదా. దేవాలయాల్లో అధికారులు న్యాయవాద చదువుకన్నా ఆథ్మాత్మికమైన విషయాలు, ఆగమ శాస్త్రం, సనాతన ధర్మం తెలిసి ఉండాలి. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో త్వరలో ఆగమశాస్త్రం, సనాతన ధర్మం, ఆథ్మాతిక విషయాలపై సర్ట్ఫికెట్ కోర్సును ఏర్పాటు చేస్తాం. ఈ కోర్సు పూర్తయినవారు రానున్న రోజుల్లో దేవాదాయ శాఖలో ఉద్యోగాలు చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రాంతాల్లో నిర్మించిన దేవాలయాల్లో అర్చక శిక్షణ ఇచ్చి అక్కడివారినే అర్చకులుగా నియమించి రూ. 5 వేలు గౌరవ వేతనం ఇచ్చేవిధంగా చర్యలు చేపట్టాం.
దేవాలయాల్లో ధూప, దీప నైవేద్యం జరిగేలా కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం. ధూప, దీప నైవేద్యం పథకంలో రాష్ట్రంలో కొన్ని దేవాలయాలకు రూ.2500లు అర్చకులకు అందించడం జరిగేది, వీటితో దీపం, నూనె, ఒత్తి, ప్రసాదం ఏర్పాటుకు ఇవ్వడం జరిగేది, అయితే ఈ మొత్తం చాలడం లేదని అంతా చెప్పడంతో రూ. 5 వేలకు పెంచాం. కొత్తగా మరికొన్ని దేవాలయాలు కూడా ధూప, దీప నైవేద్యంలోకి తీసుకునేలా చర్యలు చేపడతాం. హిందూ ధర్మపరిరక్షణకు మరిన్ని ఆలయాలు రాష్ట్రంలో ఏర్పాటు చేస్తాం. దానిని దృష్టిలో ఉంచుకుని దేవాలయాలు నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించడమే గాక, నిపుణులతో కమిటీలను కూడా వేశాం. హిందూ ధర్మరక్షణ కోసం ఆయా ప్రాంతాల్లో వారు కొలిచే దేవుళ్లు, దేవతల ఆలయాలను నిర్మించి వారితోనే అర్చకత్వం చేయించడం జరుగుతుంది. దేవాలయాల్లో భజన మండళ్లు కూడా ఏర్పాటు చేశాం. తిరుమలలో ఇటీవల జరిగిన పీఠాధిపతుల సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నాం. పీఠాధిపతుల సూచనల మేరకు భక్తబృందాల్లో ప్రతి మండలంలో ఇన్‌ఛార్జ్‌లను ఏర్పాటు చేసి హిందూ ధర్మప్రచారకులను ఏర్పాటు చేస్తాం. ప్రతి దేవాలయంలో విష్ణు, లలిత, గీతాపారాయణ జరపడం భజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది.

- పి మాణిక్యాల రావు దేవాదాయ మంత్రి, ఆంధ్రప్రదేశ్