ఫోకస్

పార్టీ బలోపేతం.. ఆ తర్వాతే ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ యావత్తు పార్టీని సంస్ధాగతంగా బలోపేతం చేసుకోవడంపై వైకాపా దృష్టిని సారించింది. పక్కన ఏపిలో అధికారంలో ఉండి అవినీతి వ్యవహారాల్లో లెక్కకు మించి డబ్బు సంపాదిస్తున్న టిడిపి, కేంద్రంలో అధికారాన్ని చూసుకుని బిజెపి, పొరుగునే ఉన్న కర్ణాటక ప్రభుత్వ మద్దతుతో కాంగ్రెస్, ఇక తెలంగాణలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఎంతైనా డబ్బును ఖర్చుపెట్టేందుకు వెనకాడడం లేదు. ఈ పోటీతో డబ్బుతోనే నెగ్గాలని చూస్తున్నారు. గ్రేటర్‌లో అసంఖ్యాకంగా ఉన్న వైకాపా పార్టీ అభిమానులు, మద్దతుదార్లతో కలిసి పార్టీని సంస్ధాగతంగా మరింత బలోపేతం చేసే దిశగా నిమగ్నమై, పరిస్ధితులు అనుకూలం అయ్యేవరకు వేచిచూడాలని నిర్ణయించాం. ఈ కారణంగా ఫిబ్రవరి 2వ తేదీన జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ సంస్ధ ఎన్నికల్లో పోటీ చేయరాదని నిర్ణయించాం. తెలంగాణ రాష్ట్ర సమితి 2009 జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో పోటీకి దిగని విషయం విదితమే. ప్రజల పక్షాన నిలిచి వారికి అవసరమైన సమయంలో అండగా ఉండేందుకు వైఎస్‌ఆర్ పార్టీ క్షణం కూడా వెనుకాడదు. పార్టీని సంస్ధాగతంగా బలోపేతం చేసుకుంటూనే ప్రజల సమస్యల పరిష్కారానికి పోరాటంలో ముందుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మా పార్టీ గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో మూడు అసెంబ్లీ సీట్లు, ఒక ఎంపి సీటు గెలుచుకుంది. పార్టీని బలోపేతం చేయడమే మా ముందున్న కర్తవ్యం

- పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధ్యక్షుడు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ