ఫోకస్

పాక్‌ను మించిపోయాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రంలోనే కాదు దేశం వ్యాప్తంగా పెచ్చరిల్లుతున్న అవినీతిని తుది ముట్టించటానికి ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులపైనే కాదు ప్రజాప్రతినిధులు, రాజకీయల పక్షాల నేతలపైనా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకోసం చట్టాలను సవరించాలి. తాజాగా జరిగిన ఎసిబి దాడుల్లో ప్రజారోగ్య శాఖకు చెందిన పాండు రంగారావు అక్రమాస్తులు రూ.800 కోట్లు పైగా, టౌన్ ప్లానింగ్ అధికారి రఘు అక్రమాస్తులు రూ.500 కోట్లుపైగా బహిర్గతమయ్యాయి. ఈ విధంగా చూస్తే వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న అధికారులు లంచగొండితనంతో ఎంతగా బరితెగిస్తున్నారో ఇట్టే అర్థమవుతుంది. ట్రాన్స్‌ఫరెన్స్ ఇంటర్నెషనల్ సంస్థ ఇటీవల ఆసియా ఖండంలోనే 18 దేశాల్లో సర్వే జరపగా పాకిస్తాన్‌కు మించి భారతదేశంలో అవినీతి, లంచగొండితనం అమితంగా ఉందని ప్రకటించింది. ఇటీవల కాలంలో అవినీతి మరింత ప్రబలింది. ప్రభుత్వంలో ఏ పని జరగాలన్నా సగటున ప్రతి పదిమందిలో కనీసం ఏడుగురు లంచాలిచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగే అవినీతి పెచ్చరిల్లినట్లు 40 శాతం ప్రజలు బాహాటంగానే చెబుతున్నారు. దీనికి మూలాలు ఏమిటో తెలియని పరిస్థితి లేకుండా పోలేదు. పోలీసు కానిస్టేబుల్, అటెండర్ ఉద్యోగ నియామకం నుంచి చివరకు బదిలీకోసం కూడా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల వరకు అన్నిస్థాయిల్లోను చేతులు తడపాల్సిన దుస్థితి నెలకొంది. నానాటికీ తీవ్రరూపం దాలుస్తున్న లంచగొండితనం, అవినీతి నిర్మూలనకోసం మరింత కఠినమైన చట్టాలతోపాటు తక్షణం సిట్టింగ్ న్యాయమూర్తుల నేతృత్వంలో టోల్‌ఫ్రీ నెంబర్లతో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
- కె రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఏపీ