ఫోకస్

బల్దియా దక్కేదెవరికో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలోని మహానగరాల జాబితాలో లేకున్నా, అంతకుమించిన ఖ్యాతితో గ్రేటర్ హోదా పొందిన హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వచ్చే నెల 2వ తేదీన జరగనున్నాయి. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఎన్నికల నోటిఫికేషన్ రానే వచ్చింది. 172 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉన్న నగరం జనాభా దాదాపు కోటికి చేరింది. మరో పదేళ్లలో నగర జనాభా 1.84 కోట్లకు పెరుగుతుందని అంచనా. అభివృద్ధి కొన్ని ప్రాంతాలకే పరిమితం కాకుండా 22 ప్రాంతాలను మల్టిపుల్ జోన్లగా గుర్తించడంతో పాటు శివారు ప్రాంతాలు సైతం నగర నడిబోడ్డు ప్రాంతాల మాదిరి ఎదగడంతో హైదరాబాద్ అత్యంత ఖరీదైన నగరంగా మారుతోంది.
అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలను తలదనే్న రీతిలో హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు జరగడం ఆనవాయితీగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలోకంటే తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరుగుతున్న తొలి కార్పొరేషన్ ఎన్నికలు కావడంతో అందరి దృష్టీ మేయర్ పదవిపై పడింది. డివిజన్ల పునర్విభజనతో కొంతమంది ఆశలు ఆవిరి కాగా, మరికొంత మందికి అదృష్టం అంది వచ్చింది. రిజర్వేషన్లతో డివిజన్లలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అన్నింటికీ మించి నామినేషన్ల దాఖలులో లోపాలతో పెద్ద పెద్ద వికెట్లు సైతం నేల కూలాయి. వారి నామినేషన్లు తిరస్కరించబడడంతో మిగిలిన వారిలో ఆశలు హెచ్చుమీరాయి.
ఎన్నికల ప్రచారంలో షరా మామూలుగానే హామీలతో స్థానిక నేతలు ఓటర్లను ఊరిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో అత్యధిక శాతం ప్రజలు చెప్పే సమస్యలు మూడు. ఒకటి ట్రాఫిక్, రెండోది నీటి సమస్య, మూడోది అవినీతి. కాలుష్యం, మత ఘర్షణలు, ప్రజారవాణా సౌకర్యాలు లాంటి సమస్యలు ఉండనే ఉన్నాయి. తాగునీటి సమస్య పరిష్కారానికి హిమాయత్‌సాగర్, సింగూరు జలాశయం, కృష్ణా తాగునీటి మొదటి దశ ప్రస్తుతం ఉన్న ప్రధాన నీటివనరులు. కృష్ణానది నుండి తాగునీటిని సరఫరా చేసే ప్రాజెక్టు రెండో దశ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. దక్కను పీఠభూమిపై ఉన్న హైదరాబాద్ ఎర్ర రాళ్లతో కూడుకుని ఉండటం, నిరంతరం వాటిని పగలగొట్టడంతో పర్యావరణ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. మరో పక్క హిందూ ముస్లింలతో కూడుకున్న మిశ్రమ సంస్కృతి కావడంతో ఘర్షణలకు అవకాశం ఎక్కువగా ఉంటోంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కారణంగా ఘర్షణలను చాలావరకూ నివారించగలిగినా, ఉద్రిక్తతలు మాత్రం అంతగా తగ్గుముఖం పట్టలేదు. దేశంలోని ఇతర నగరాల మాదిరి హైదరాబాద్‌కూ ట్రాఫిక్ సమస్య ఎన్నటికీ తీరనిదే. ఎంఎంటిఎస్ కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడంతో వీటి ఉపయోగం తక్కువగానే ఉంది. తాజాగా మెట్రో నిర్మాణం చేపట్టి ఐదేళ్లు గడుస్తున్నా నేటికీ పూర్తికాలేదు. ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది.
కులీ కుతుబ్ షా 1590లో హైదరాబాద్‌ను నిర్మించాడు. 426 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న గొప్ప నగరంగా హైదరాబాద్ విలసిల్లింది. కుతుబ్ షాహీ నవాబు నిర్మించిన ఈ నగరం తొలుత చించలం (ఇపుడు శాలిబండ) పేరుతో చిన్న గ్రామంగా ఉండేది. 1990లో కలరా మహమ్మారి సోకి గోల్కొండ నగరం అతలాకుతలం అయింది. దాంతో నవాబ్ అక్కడి నుండి వచ్చి చించలం (శాలిబండ)లో తాత్కాలిక బస ఏర్పాటు చేశాడు. 1594లో నాల్గవ ఖలీఫా హజరత్ హైదర్ అలీ పేరిట నగరాన్ని నిర్మించాడు. సకల కళలకు కాణాచిగా, ఇటు సంప్రదాయ వాదులకు, అటు ఆధునిక వాదులకు వేదికగా నిలిచే హైదరాబాద్ పలు సౌకర్యాలలో ముందంజలో ఉంది. బహుళ ఔషధ ఉత్పత్తిలోనూ, ఐటి రంగం, విద్యారంగం, ఆతిథ్య రంగం, వైద్య రంగాల్లో హైదరాబాద్ అగ్రగామిగా నిలిచింది. అలాంటి నగరంలో ఎన్నికలు సహజంగానే వాడి-వేడిగానే జరుగుతాయి.
నామినేషన్ల పర్వం ముగిసింది, ఉపసంహరణల పర్వం కూడా ముగిసింది. అభ్యర్థులపై స్పష్టత రావడంతో అన్ని పార్టీల ప్రచారం పతాకస్థాయికి చేరింది. పరస్పర ఆరోపణలు, దూషణలు, సౌకర్యాల కల్పనపై అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న అధికార పార్టీ హామీలను విపక్షాలు తిప్పికొడుతున్నాయి. గల్లీ గల్లీలో పర్యటించి నాయకులు చాలా రోజుల తర్వాత స్థానిక సమస్యలపై దృష్టిసారించారు. ఈ క్రమంలో జిహెచ్‌ఎంసి ఎన్నికల తీరుతెన్నులపై ఈ వారం ఫోకస్.