ఫోకస్

విద్యార్థుల ఆత్మహత్యలకు ఎవరు కారణం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ర్యాంకుల హోరెత్తినట్టు రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు హోరెత్తుతున్నాయి. ఒకటి... ఒకటి... ఒకటి..., రెండు... రెండు... రెండు... అంటూ టీవీ చానళ్లలో ఊదరగొట్టే కార్పొరేట్ విద్యాసంస్థల నిర్వాకానికి ఆత్మహత్యల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. కాలేజీల ఒత్తిడి కారణంగానే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. అదేమీ లేదని, కుటుంబ పరిస్థితులు, మానసిక పరిస్థితుల్లో తేడాలు, సామర్థ్య లోపం, సమాజ ప్రభావం, ప్రేమ, సామాజిక మాధ్యమాలు తదితర అంశాలు ఆత్మహత్యలకు కారణమని కాలేజీల యాజమాన్యాలు చెబుతున్నాయి. కారణాలు ఏమైనా ఆత్మహత్యలను ఆపాల్సిన తరుణం ఆసన్నమైంది. నెల రోజుల వ్యవధిలో సుమారు 50 మంది విద్యార్థులు ఇటు అమ్మాయిలు, అటు అబ్బాయిలు వేర్వేరు కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. కొన్ని ఆత్మహత్యల వ్యవహారం కుటుంబ సభ్యులకు, యాజమాన్యాలకు మధ్యనే ఉండిపోతున్నాయి, కనీసం ఆయా క్యాంపస్‌లలోని విద్యార్థులకు సైతం తెలియనీయడం లేదు. ఆయా కుటుంబాల ఆర్థిక నేపథ్యం చూసుకుని కాలేజీలు ఎంతోకొంత ముట్టజెప్పి పోలీసు కేసులు కూడా లేకుండా చేసుకుంటున్నాయి. సరిగ్గా పుష్కరం క్రితం ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షురాలిగా వ్యవహరించిన ప్రొఫెసర్ పి.నీరదారెడ్డి కమిటీ ఆత్మహత్యలపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి నివేదికను ఇచ్చింది. దానిపై ఎంతో చర్చ జరిగినా వాస్తవిక నివేదిక వెలుగు చూడలేదు. ఆత్మహత్యలు వంటి సంఘటనలు జరిగిన వెంటనే ఆయా కాలేజీల యాజమాన్యాలపై కఠినచర్యలు తీసుకోవల్సిన ప్రభుత్వాలూ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. సంఘటన జరిగిన తర్వాత హడావుడి చేయడం, దర్యాప్తు నిర్వహించడం, నివేదికలను తెప్పించడం, తర్వాత వౌనం పాటించడం షరా మామూలైపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన చక్రపాణి నివేదిక కూడా నేటికీ వెలుగు చూడలేదు. ఒకపుడు జూనియర్ కాలేజీలకే పరిమితం అయిన ఈ ఆత్మహత్యలు ఐఐటిలకు, ట్రిపుల్ ఐటిలకు, చివరికి హైస్కూళ్లకు సైతం పాకాయి. రాష్ట్ర ప్రభుత్వాలు సమీక్ష పేరుతో సమావేశాలు నిర్వహించి విద్యార్థులకు, తల్లిదండ్రులకు మార్గదర్శకాలను జారీచేసి చేతులు దులుపుకున్నాయి. ఆత్మహత్యలపై ఒక రిజిస్ట్రీ కాని, అందుకు కారణాలు కాని అనే్వషించే ప్రయత్నం నేటికీ ఎవరూ చేయలేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకునే చందంగా ప్రభుత్వ అధికారులు వ్యవహరిస్తున్నారు. ఈ అంశంపైనే కొంతమంది ప్రముఖుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.