ఫోకస్

జనాభాకు అనుగుణంగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెరిగిన జనాభాకు అనుగణంగా లోక్‌సభ స్థానాల సంఖ్యను కూడా పెంచాలి. ప్రతి లోక్‌సభ స్థానం పరిధిలో సుమారు 15 లక్షల వరకూ జనాభా ఉండేవారు. ప్రస్తుతం ఈ సంఖ్య పెరిగి, కొన్నిచోట్ల 17-18 లక్షల వరకూ చేరింది. రాష్ట్రంలో ఒక్కో లోక్‌సభ స్థానం పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలున్నాయి. అయితే జనాభా పెరిగిన నేపథ్యంలో లోక్‌సభ స్థానాల సంఖ్యను కూడా పెంచే ఆలోచన తప్పక చేయాలి. దీనివల్ల రోజురోజుకీ అనూహ్యంగా పెరిగిపోతున్న జనాభా అందరికి న్యాయం చేసే పరిస్థితి ఏర్పడుతుంది. నియోజకవర్గ పరిధి విస్తృతంగా ఉన్నందువల్ల అన్ని ప్రాంతాల్లో కలియతిరగడం, ప్రజల సమస్యలను పూర్తిస్థాయిలో పార్లమెంటులో వినిపించడం కష్టతరంగా ఉంది. ఈ నేపథ్యంలో లోక్‌సభ స్థానాలను పెంచడం ద్వారా మరింత ఎక్కువగా ప్రజలతో మమేకమై వారి అవసరాలు తెలుసుకుంటూ వారి గొంతును పార్లమెంటులో ఎంపీలు వినిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం లోక్‌సభలో 543 మంది ఎంపీలు ఉన్నారు. వీరంతా కూర్చునేందుకు సభలో ఇరుకుగా ఉంటోంది. స్థానాల సంఖ్యను పెంచడంతో పాటు కొత్త పార్లమెంటు భవన నిర్మాణం గురించి కూడా విస్తృత చర్చ జరగాల్సి ఉంది. ఇప్పటికే అటువంటి ప్రతిపాదన ఉంది. దీన్ని త్వరితగతిన అమలులోకి తీసుకువస్తే ఎంతో మంచిది. రాజ్యాంగాన్ని అనుసరించి 2026 వరకు లోక్‌సభ స్థానాల పునర్విభజన జరిగే వీలులేదు. అయితే ఈలోగా కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించి నియోజకవర్గాలు పునర్విభజన పూర్తయ్యే సమయానికి సిద్ధం చేయాలి. దేశానికి ఒక మకుటంలా ఉండే పార్లమెంటు భవనాన్ని వీడడం అందరికీ బాధాకరమైనా దానిని భావితరాలకు ఉపయుక్తంగా ఏదైనా ప్రత్యేక భవనంగా రూపకల్పన చేసుకోవచ్చు.

- మేకపాటి రాజమోహన్‌రెడ్డి నెల్లూరు పార్లమెంటు సభ్యుడు