ఫోకస్

పెంచితే అనిశ్చితే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో ప్రస్తుతమున్న లోక్‌సభ స్థానాలవల్ల పరిపాలనకు పెద్దగా ఇబ్బందేమీ కలగడం లేదు. కేవలం రాజకీయ ప్రయోజనాలను ఆశించి లోక్‌సభ స్థానాలు పెంచడంద్వారా ప్రజలకు చెప్పుకోదగ్గ ప్రయోజనం ఉండదు. ప్రస్తుతం లోక్‌సభలో ఉన్న సభ్యులు రాష్ట్రాలకు సంబంధించిన ఆర్థిక, సాంఘిక, సామాజిక సమస్యల్ని కేంద్రం దృష్టికి తీసుకెళుతున్నారు. ఒక ఆర్థిక సంవత్సరంలో నాలుగు దశల్లో నిర్వహించే సమావేశాల్లో సమస్యల్ని చర్చించి పరిష్కారం చూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో స్థానాల పెంపు అంత అవసరం లేదు. ఇలా చేయడం చిన్న రాష్ట్రాలకు అసలే మంచిది కాదని చెప్పాలి. సీట్ల పెంపుతో రాజకీయ అనిశ్చితి ఏర్పడుతుంది. మేఘాలయ, మణిపూర్ లాంటి చిన్న రాష్ట్రాల్లో రాజకీయంగా గందరగోళ పరిస్థితి నెలకొంది. పార్టీ ఫిరాయింపులు తరచూ చోటుచేసుకుంటున్నందున రాష్ట్రాల్లో అక్కడి పార్టీలకు కూడా ఇబ్బందిగానే పరిణమిస్తుంది. ఇక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం వేగంగా పెరుగుతోంది. అదేవేగంతో మారుమూల గ్రామాలకూ విస్తరిస్తోంది. విద్యావంతుల శాతంకూడా పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో సైతం భవిష్యత్తులో విద్య ప్రాధాన్యత లేకుంటే మనుగడ సాగించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం నేరుగా గ్రామీణ ప్రజలతో మమేకమై సంభాషించే పరిస్థితులు వచ్చాయి. వివిధ రకాల సమస్యలపై ప్రజల అభిప్రాయాలను పాలకులు నేరుగా తెలుసుకోవడం సులభతరమైంది. సోషల్ మీడియా సైతం విస్తరిస్తూ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇలాంటి సమయంలో కొత్తగా లోక్‌సభ స్థానాలు పెంచాల్సిన అవసరం లేదు. దేశాభివృద్ధిని, సమస్యల్ని సాంకేతిక పరిజ్ఞానం ద్వారా దగ్గరగా చూడొచ్చు. కొత్తగా లోక్‌సభ స్థానాలు రావడం వల్ల ఆర్థికంగా ప్రభుత్వానికి కూడా అదనపు భారం పడుతుంది. ఎంపీల జీతభత్యాలు, ఐదేళ్ల నిర్వహణ వ్యయం, పెన్షన్ చెల్లింపులు, వేతనాల రివిజన్ వంటి ఎన్నో భారాలు మోయాల్సి వస్తుంది. ఇది అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికీ సమస్యే.

- నిమ్మల కిష్టప్ప హిందూపురం పార్లమెంటు సభ్యుడు, అనంతపురం జిల్లా.