ఫోకస్

ఓట్లు పడేది మాటలకా..చేతలకా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుజరాత్ ఎన్నికల అంకం ముగిసింది. సీట్లు తగ్గినా అధికారంలోకి వచ్చామనే ఆనందంలో బీజేపీ, అధికారంలోకి రాలేకపోయినా, సీట్లు పెంచుకున్నామనే ఆనందంలో కాంగ్రెస్ పార్టీలు సంతోషంలో మునిగితేలుతున్నాయి. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు. హిమాచల్‌ప్రదేశ్ ఎన్నిక గురించి ఎవరూ మాట్లాడటం లేదు. దానికి కారణం గుజరాత్ ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం కావడం, రానున్న సార్వత్రిక ఎన్నికలకు గుజరాత్ రాష్ట్రం ఎన్నికలు సెమిఫైనల్స్‌గా భావించడం, గుజరాత్‌తోనే దేశంలో దశ, దిశ మారుతుందని బీజేపీ భావించడంతో ఈ ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఇంకోపక్క దేశంలోని అన్ని పార్టీలూ సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నాయి. గుజరాత్ ప్రయోగం తెలుగు రాష్ట్రాలపై ఉంటుందా? ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు ఆశ్చర్యపరచగా, అసలు ఫలితాలు ఇంకా ఆశ్చర్యపరిచాయి. అలాంటి ఆశ్చర్యకర ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో కూడా జరిగే అవకాశం ఉందా అనేది చూడాల్సి ఉంది. వాస్తవానికి ఎన్నికలకు చాలా గడువు ఉన్నా, సన్నద్ధత మొదలైంది. అంతర్గతంగా పార్టీలు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించాయి. గుజరాత్‌లో అభివృద్ధి అజెండాను బీజేపీ తలకెత్తుకోగా, మిగిలిన చాలా అంశాలను ప్రధానంగా జీఎస్‌టీ, పెద్ద నోట్ల రద్దు, ఆర్థిక సంస్కరణల్లో లోపాలు, ధరలు, రిజర్వేషన్ల వంటి అంశాలనే అస్త్రాలుగా కాంగ్రెస్ ఎన్నికల బరిలోకి దిగింది.
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ మరోమారు గద్దెనెక్కేందుకు సంక్షేమ పథకాలతో ముందుకు వెళ్తుండగా, నిరుద్యోగం, రైతాంగ సమస్యలు, ఆత్మహత్యలు, మ్యానిఫెస్టో అమలులో వైఫల్యాలు ప్రధానంగా తీసుకుని విపక్షాలు తమ వాగ్బాణాలతో సిద్ధమవుతున్నాయి. అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఉంది. కొత్త రాజధాని నిర్మాణంలో ప్రభుత్వం విఫలమైందంటూ వైకాపా తదితర పార్టీలు ఉద్యమిస్తుండగా, తెలుగుదేశం పార్టీ సంక్షేమ కార్యక్రమాలను, ఐటి రంగంలో ఉద్యోగ అవకాశాలు, నూతన రాజధాని, వౌలిక సదుపాయాల కల్పన, ఎయిర్‌పోర్టుల నిర్మాణం వంటి అంశాలను అస్త్రాలుగా చేసుకుని ఎన్నికలకు సిద్ధం అవుతోంది. ప్రజలు మాత్రం ఆయా పార్టీలు ఎన్నికల ముందు ఇచ్చిన మ్యానిఫెస్టోలను ఎంతవరకూ అమలుచేశారో, కొత్తగా ఇవ్వబోయే హామీలు ఏమిటో అని ఎదురుచూస్తున్నారు. హామీలకు ఓట్లు రాలతాయా? వాస్తకవికంగా క్షేత్రస్థాయిలో సాధించిన విజయాలకు ఓట్లు వస్తాయా అనేది తేలాలంటే 2019 ఎన్నికల వరకూ ఆగాల్సిందే, అయినా ఈ అంశంపై విస్తృత స్థాయిలో చర్చమాత్రం మొదలైంది. వివిధ పార్టీల నేతల అభిప్రాయాలు ఏమిటో ఈ వారం చూద్దాం.