ఫోకస్

సీబీఐ కేంద్రం కీలుబొమ్మేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీబీఐ పంజరంలో చిలుకలా మారిపోయింది.. మాస్టార్లు చెప్పినట్టు పలుకుతోంది.. సాక్షాత్తు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలివి. సీబీఐ ఎవరి నేతృత్వంలోనూ పనిచేయాల్సిన అవసరం లేదని, పూర్తి స్వతంత్రంగా వ్యవహరించాలని కూడా సుప్రీం కోర్టు పేర్కొంది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వానికి మొట్టికాయలు కూడా వేసింది. సీబీఐ నివేదికలను తెప్పించుకోవడంతోపాటు వాటిలో మార్పులు చేర్పులు చేసిన తీరును కూడా తీవ్రంగా ఆక్షేపించింది. దర్యాప్తు సంస్థలో జోక్యం చేసుకోవడంపై మండిపడింది. సీబీఐకి స్వయం ప్రతిపత్తి కల్పించాల్సిన అవసరం ఉందని, తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు చెప్పి అప్పుడే ఐదేళ్లు గడిచిపోయాయి. సుప్రీం కోర్టు ఆశించినట్టు ఇంకా సీబీఐకి స్వయం ప్రతిపత్తి, స్వతంత్ర హోదా దక్కలేదనే చెప్పాలి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్ అంటే కేంద్ర దర్యాప్తు సంస్థ. భారత దేశంలో అగ్రగామి పోలీసు విచారణ సంస్థ. ఇది ప్రజాజీవితంలో ఒక శక్తివంతమైన పాత్రను పోషిస్తోంది. జాతీయ ఆర్థిక వ్యవస్థ కుశలతకు భరోసా ఇస్తోంది. ఇది భారత ప్రభుత్వం అధికార పరిధిలో ఉంటుంది. సిబిఐ దేశీయ భద్రతా విధులకోసం స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్‌గా 1941లో ఏర్పాటైంది. దీని పేరును 1963 ఏప్రిల్ 1న కేంద్ర దర్యాప్తు సంస్థగా (సిబిఐ)గా మార్చారు. దీని నినాదం శ్రద్ధ, నిష్పాక్షికత, న్యాయవర్తన. ఇపుడు ఈ మూడు అంశాలే ప్రశ్నార్థకంగా మారాయి. సీబీఐ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. క్షేత్ర కార్యాలయాలు భారతదేశం అంతటా ప్రధాన నగరాల్లో ఉన్నాయి. తాజాగా తమిళనాడులో శశికళ ఇంటిపై దాడి, 2జి స్పెక్ట్రమ్‌లో ఢిల్లీ కోర్టు తీర్పు, లాలూ ప్రసాద్ దాణా కుంభకోణం, వివిధ రాష్ట్రాల్లో అక్రమాస్తుల కేసులకు సంబంధించిన కేసులను సీబీఐ విచారిస్తున్న తీరుతెన్నులు చూసినవారికి ఆ సంస్థ నిష్పాక్షికతపై అనుమానాలు కలుగక మానవు. సీబీఐ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలకు నిర్ధిష్టమైన ఆధారాలు లేకపోయినా, అనుమానాలు మాత్రం నివృత్తి కావడం లేదు. ఇన్ని అనుమానాలున్నా, దేశంలో పెద్ద నేరాలు ఏం జరిగినా స్థానికులు సీబీఐ దర్యాప్తునే కోరుకుంటారు. అంటే సంస్థ దర్యాప్తుపై ఉన్న నమ్మకం దేశ ప్రజల్లో మాత్రం చెక్కుచెదరలేదు. సీబీఐ పూర్తిగా ప్రభుత్వంతో సంబంధం లేని సర్వస్వతంత్ర సంస్థగా మారడానికి అన్ని రాజకీయ పక్షాలూ అంగీకరిస్తాయా అనేది అనుమానమే. ఒక వేళ స్వతంత్ర ప్రతిపత్తిని ఇచ్చినా, అందుకు తగ్గట్టు సీబీఐ పనిచేయగలుగుతుందా అనే అనుమానాలు కూడా నివృత్తికానివే. అటానమి ఉన్నంత మాత్రాన సీబీఐ వల్ల కొత్తగా ఏదో ఒరుగుతుందనే నమ్మకాన్ని ఆ సంస్థ ఇవ్వలేకపోతోంది. సీబీఐ, దాని దర్యాప్తు తీరుపై కొంతమంది న్యాయ కోవిదుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.