ఫోకస్

అభివృద్ధికి నోచుకోని పట్టణాల సంగతేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో ఎంపిక చేసిన నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయాలని కేంద్రప్రభుత్వం తలపెట్టడం మంచి పరిణామమే. కానీ అభివృద్ధి చెందిన నగరాలనే మరింత అభివృద్ధి చేస్తామంటే ఎలా? అసలు అభివృద్ధికి నోచుకోని నగరాల సంగతేంటి. వీటి గురించి కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన అవసరం ఉంది. పక్షపాతం అసలు పనికిరాదు. మెట్రోపాలిటిన్ నగరాలు కొన్ని స్మార్ట్ సిటీల జాబితాలోకెక్కాయి. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చాలా పట్టణాలు అందుకు నోచుకోలేదు. ఒక మాదిరి నగరాలు, పట్టణాల్లో అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంది. స్మార్ట్ సిటీల తరహాలో వీటిని కూడా అభివృద్ధి చేస్తే బాగుంటుంది. ఇప్పుడున్న విధానం ప్రకారం బాగున్న నగరాలు మరింత బాగుపడితే, అధ్వానంగా ఉన్న పట్టణాలు మరింత అధ్వానంగా తయారవుతాయి. మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు నిధుల కొరత కారణంగా అభివృద్ధి గురించి ఆలోచించడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిలో ద్వితీయ నగరాలను కూడా పరిగణనలోకి తీసుకుని ఉండి ఉంటే బాగుండేది. కానీ అలా జరగలేదు. స్మార్ట్ నగరాల ఎంపిక కూడా పూర్తి పారదర్శకంగా జరగాలి. తెలంగాణలో ఒక్క నగరాన్ని కూడా చేర్చకపోవడం మంచిది కాదు. అసలు స్మార్ట్ నగరాల ఎంపికకు అనుసరిస్తున్న మార్గదర్శకాలు ఏమిటో కూడా సరిగ్గా కేంద్రం వెల్లడించలేదు. ఎపిలో కేవలం విశాఖ, కాకినాడలను మాత్రమే స్మార్ట్ నగరాల జాబితాలో చేర్చారు. మరి తిరుపతి సంగతేమిటి, రాయలసీమ జిల్లాల్లో ఒక్కటి కూడా స్మార్ట్ నగరం జాబితాలో అర్హత పొందేందుకు నోచుకోలేదు. పక్షపాత వైఖరితో కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ నగరాల ఎంపిక చేసిందనే భావన చాలామందిలో ఉంది. తెలంగాణలో కరీంనగర్, వరంగల్ నగరాలను స్మార్ట్ జాబితాలో చేర్చాలని ఆ ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. కానీ ఒక్క నగరం ఆ అవకాశాన్ని అందుకోలేక పోయింది. దీంతో ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఏదైనా పారదర్శకంగా ఉండాలి తప్ప పక్షపాతంతో నిర్ణయాలు జరగకూడదు. ప్రజల్లోనూ స్మార్ట్ నగరాల పట్ల అవగాహన పెంచాలి. ప్రభుత్వం ఒక కొత్త పథకం ప్రవేశపెట్టినప్పుడు దాని గురించి పూర్తి సమాచారం ప్రజల ముందుంచాలి. దీనిపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాల్సి ఉంది.

- కె.రామకృష్ణ, సిపిఐ, ఎపి రాష్ట్ర కార్యదర్శి