ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్ర భవిత గురించి ఆలోచించు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతిపక్ష నేత జగన్‌కు అధికారపక్ష నేతల సలహా
హైదరాబాద్, మార్చి 14: ఆంధ్రప్రదేశ్ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని జగన్ కాస్త ఆలోచించాలని టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. సోమవారం శాసనసభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష నేతకు అధికార కాంక్షతోనే అవిశ్వాస తీర్మానం పెట్టారని విమర్శించారు. గతంలో ప్రభుత్వాన్ని పడగొడతానని రాజ్‌భవన్ సాక్షిగా జగన్ ప్రకటన చేశారని గుర్తుచేశారు. పార్టీలోకాని, లోటస్ పాండ్‌లోగాని ఆయన ప్రవర్తన నచ్చకే ఎమ్మెల్యేలు బయటికి వస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష నేత నేర చరిత్ర అందరికీ తెలుసని అన్నారు. పరిటాల రవి హత్యలో ప్రతిపక్ష నేతపై ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. జూబ్లీహిల్స్ కారు బాంబు కుట్ర వెనుక జగన్ ఉన్నట్టు మంగలి కృష్ణ చెప్పాడని, తాను అన్ని సాక్ష్యాధారాలతో మాట్లాడుతున్నానని అన్నారు. ప్రతిపక్షం పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఆ పార్టీ సభ్యులే వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు.
మట్టిపనులతో నిధులు కొల్లగొట్టారు: దేవినేని
గతంలో వైఎస్ హయాంలో జలయజ్ఞం పేరిట మట్టి పనులు మాత్రమే చేసి నిధులను కొల్లగొట్టారని జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. అసెంబ్లీలో వైకాపా అవిశ్వాస తీర్మానంపై ఆయన మాట్లాడారు. జీవో 13ను రెండేళ్లు గాలిలో పెట్టి మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల పేరిట నిధులను మింగేశారని ధ్వజమెత్తారు. బెంగలూరులో 30 ఎకరాల్లో కట్టుకున్న బంగళా కూడా ఆ నిధులతో కట్టిందేనని ఆరోపించారు. నిర్వాసితులను రెచ్చగొట్టి పోలవరం పనులను అడ్డుకుంటున్నారని అన్నారు. 2018 నాటికి పోలవరం పనులు పూర్తిచేస్తామని అన్నారు. ఈ బడ్జెట్‌లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 3600 కోట్లు కేటాయించినట్టు తెలిపారు.
సంక్షేమ పథకాల ఘనత మాదే: రావెల
దేశంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను సమర్ధంగా అమలుచేస్తోన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని అన్నారు. శాసనసభలో వైకాపా అవిశ్వాస తీర్మానంపై ఆయన మాట్లాడుతూ వైఎస్ హయాంలో ఈ పథకాన్ని నిర్వీర్యం చేశారని ఆరోపించారు. దళితులకు మోసం చేసి అనేక కుంభకోణాలతో వారిని పేదరికంలో నిరుద్యోగంలో వెనుకబాటుతనంలో ముంచారని ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టంపై ప్రతిపక్ష నేత జగన్ అవగాహన పెంచుకోవాలని సూచించారు. రాష్ట్రంలో గిరిజనులు, దళితులు సంక్షేమానికి అనేక కొత్త పథకాలు ప్రవేశపెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు.
జగన్‌కు ఆమాత్రం తెలియదా?: కాల్వ
ఎస్సీ, ఎస్టీ జాబితాలో ఓ కులాన్ని చేర్చాలన్నా, తీసివేయాలన్నా ఆ అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉంటుందని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. ఎపి అసెంబ్లీలో వైకాపా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. అయితే జాబితాల్లో కులాలను చేర్చే విషయం పార్లమెంటు సభ్యుడిగా పనిచేసిన జగన్మోహన్‌రెడ్డికి తెలియదా అని అన్నారు. అంతేగాక, ప్రతిపక్ష నేత సభలో చెప్పిందే చెబుతూ అవాస్తవాలు మాట్లాడుతున్నారని అన్నారు. ఎపుడైనా నిర్మాణాత్మకమైన సూచనలు చేశారా అని ప్రశ్నించారు.
తుని ఘటన దారుణం: హోం మంత్రి
తునిలో ముద్రగడ పద్మనాభం దీక్ష నేపథ్యంలో జరిగిన ఘటన చాలా దారుణమని ఎపి హోం మంత్రి చినరాజప్ప అన్నారు. అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై ఆయన మాట్లాడుతూ తుని ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సిఐడి విచారణ జరుగుతోందని, అన్ని విషయాలు తెలుస్తాయని అన్నారు. ఇది దేశ చరిత్రలో దారుణ ఘటనగా మిలిగిపోతోందని అన్నారు.
అలా మాట్లాడే హక్కు జగన్‌కు లేదు
వైకాపా అధినేత జగన్ తొలి అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన క్యాసెట్లు పరిశీలిస్తే అవి, నేడు మాట్లాడుతున్న ఉపన్యాసం అంతా ఒక్కటేనని కార్మిక మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. చెప్పిందే చెప్పి అవాస్తవాలు చెబుతున్నారని అన్నారు. రాష్ట్రంలో 43.5 లక్షల మంది పేదలకు ఈ ప్రభుత్వం పెన్షన్లు ఇస్తోందని అన్నారు. కాని తక్కువ మందికి మాత్రమే పెన్షన్లు ఇస్తున్నామనేది ఆరోపణ మాత్రమేనని అన్నారు. అలాగే ఇళ్ల కేటాయింపుపై నైతిక హక్కు జగన్‌కు లేదని చెప్పారు. గతంలో వైఎస్ హయాంలో కట్టిన 43 లక్షల ఇళ్లు ఎక్కడ ఉన్నాయో ఎవరికీ కనబడటం లేదని చెప్పారు.