రాష్ట్రీయం

సెలవుగా.. సకల సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ సర్కార్ జీవో జారీ

హైదరాబాద్, జనవరి 2: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అన్ని ఉద్యోగ సంఘాలు కలిసి చేపట్టిన సకల జనుల సమ్మెను స్పెషల్ క్యాజువల్ లీవ్‌గా పరిగణిస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలోని గెజిటెడ్, నాన్‌గెజిటెడ్ ఉద్యోగులు 2011 సెప్టెంబర్ 13న సకల జనుల సమ్మెను చేపట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో 42 రోజుల పాటు సమ్మెలో పాల్గొన్న అనంతరం అక్టోబర్ 25న సమ్మెను విరమించి విధుల్లో చేరారు. ఈ సమ్మె కాలాన్ని ఆన్ డ్యూటీగా పరిగణించాలని ఉద్యోగ సంఘాల జెఎసి చైర్మన్, ఇతర ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అప్పట్లో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే.
అనంతరం ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలించి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు జిల్లా, జోనల్, మల్టీ జోనల్ క్యాడర్, స్థానిక ఉద్యోగులందరికి వర్తిస్తుందని తెలిపింది. ఉద్యోగులకు సెలవులు మంజూరు చేసే అధికారి తప్పకుండా ఈ ప్రత్యేక క్యాజువల్ లీవ్‌ను సర్వీస్ రిజిష్టర్‌లో నమోదు చేయాలని ప్రభుత్వం సూచించింది. సకల జనుల సమ్మెలో పాల్గొన్న ఉద్యోగుల్లో ఎవరైనా ఉద్యోగ విరమణ చేసినా, లేక చనిపోయినా ఆ ఉద్యోగికి రావాల్సిన ఏరియర్స్ గానీ ఇతర ప్రయోజనాలు గానీ ఉంటే ఆ మొత్తాన్ని సంబంధిత చట్టబద్ద హక్కుదారులు ఎవరుంటే వారికి చెల్లించాలని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. సకల జనుల సమ్మె జరిగిన రోజుల్లో సొంత పనుల మీదగానీ, మరేఇతర కారణాలతో గానీ సెలవు అధకారికంగా పెట్టి ఉంటే అటువంటి వాటిని ఈ ప్రత్యేక క్యాజువల్ లీవ్‌తో పరిగణించరాదని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
ఆ తరహా సెలవులను వేరుగా పరిగణించి నిబంధనల మేరకు అనుమతించాలి తప్ప ప్రత్యేక క్యాజువల్ లీవ్ నిబంధనలను అమలు చేయవద్దని తెలిపింది. సచివాలయంలోని అన్ని శాఖలు, అన్ని శాఖల ప్రధాన అధిపతులు ప్రభుత్వం అనుమతించిన స్పెషల్ క్యాజువల్ లీవ్ ఉత్తర్వులను అమలు చేయాలని ఆదేశించింది.