ఆంధ్రప్రదేశ్‌

ఇక ఎవరి జిసిసి వారిదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 3: గిరిజన సహకార సంస్థ (జిసిసి) ఇక నుంచి ఎపిలో సొంతంగా వ్యాపారం చేసుకోనుంది. తెలంగాణ గిరిజన సహకార సంస్థ(టిజిసిసి)గా రిజిస్ట్రేషన్ చేయించుకునేందకు అపెక్స్ కమిటీ ఆమోదం తెలిపింది. ఇటీవల కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. దీంతో తెలంగాణాతో ఆంధ్రా జిసిసి తెగతెంపులు చేసుకునేందుకు గ్రీన్‌సిగ్నల్ లభించినట్టు అయ్యింది. ఈ ప్రక్రియ పూర్తయితే తదుపరి నవ్యాంధ్రప్రదేశ్ పాత పద్ధతిలోనే జిసిసిగా కొనసాగనుంది. తెలంగాణా ప్రభుత్వం మాత్రం టిజిసిసిగా నామకరణ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పటికే ఉద్యోగుల బదిలీలు పూర్తయ్యాయి. ఎక్కడి ఉద్యోగులు అక్కడే పనిచేస్తున్నారు. ఇదంతా ఏడాది కిందటే పూర్తయ్యింది. ఆస్తుల పంపకాలు కొలిక్కి వచ్చేసాయి. 58:42 నిష్పత్తిలో పంపకాలు జరిగిపోయాయి. జిసిసికి ఇందులో 58 శాతం వాటా లభించింది. అలాగే రాష్టస్థ్రాయిలో పనిచేసే ఉద్యోగులు తక్కువశాతంలోనే ఉన్నందున ఇది కూడా పూర్తయ్యింది. ఇక మిగిలిదంతా వ్యాపార విభజనే జరగాల్సి ఉంది. ఇపుడు దీనికి గ్రీన్‌సిగ్నల్ లభించడంతో ఇక నుంచి జిసిసి తన సొంతంగానే వ్యాపార లక్ష్యాలను సాధించుకోనుంది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌లోకి అడుగుపెట్టిన జిసిసి ఆన్‌లైన్ వ్యాపారంతో అటవీ ఉత్పత్తుల వ్యాపారాన్ని అనూహ్యంగా పెంచుకోగలిగింది. ఈ విధంగా రూ.100 కోట్ల నుంచి రూ.350 కోట్లకు వ్యాపార లక్ష్యాలు చేరుకున్నాయి. సహజసిద్ధమైన అటవీ ఉత్పత్తుల అమ్మకాలు రాష్ట్రేతర ప్రాంతాల్లోనే కాకుండా దేశీయ మార్కెట్‌లోకి అడుగుపెడుతున్నాయి. కార్పొరేట్ సంస్థలతో భాగస్వామ్యమై మరీ వ్యాపారాన్ని పెంచుకోగలుగుతున్న జిసిసి గత ఏడాదికాలంగా ఆన్‌లైన్ వ్యాపారాన్ని సాగిస్తుంది. అరకు కాఫీని ఇపుడు అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళగలిగింది. గిరిజన తేనెకు డిమాండ్ పెరగడంతోపాటు ఔషధాల్లో మిశ్రమంగా వాడే గమ్‌కరియా, వేసవితాపాన్ని తీర్చే నన్నారి షర్బత్, సహజసిద్ధమైన అటవీ ఉత్పత్తులతో తయారయ్యే సబ్బులు, షీకాయ, కరక్కాయ, తేనె, చింతపండు అమ్మకాలు మరింతగా పెంచగలిగింది. దళారీ మోసాలను అరికట్టేందుకు వీలుగా కాఫీ ప్రాజెక్టు ద్వారా రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడంలో జిసిసి సఫలీకృతమైంది.