రాష్ట్రీయం

ఎంపి కొత్తపల్లి గీత ఎస్టీకాదు.. బిసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* పదవికి రాజీనామా చేయాలి
* వైకాపా ఎమ్మెల్యే జి ఈశ్వరి డిమాండ్
హైదరాబాద్, మార్చి 12: అరకు ఎంపి కొత్తపల్లి గీత లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని వైకాపా ఎమ్మెల్యే జి ఈశ్వరి లోక్‌సభ స్పీకర్‌ను కోరారు. కొత్తపల్లి గీత ఎస్టీ వర్గానికి చెందిన మహిళ కాదని, వెంటనే పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, ఎంపి గీత సోదరుడు ఎస్టీ కాదని తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం తేల్చిందన్నారు. ఇటువంటి పరిస్ధితుల్లో ఎస్టీ కోటా నుంచి ఎంపికైన కొత్తపల్లి గీత నైతిక విలువలను పాటించి పదవికి రాజీనామా చేయాలన్నారు. ఆదివాసీలకు చెందిన సీటులో ఆమెకొనసాగడం ధర్మం కాలేదన్నారు.
తప్పుడు కులం కార్డుతో తంటాలు!
విశాఖపట్నం: రాష్ట్రంలో రిజర్వుడు కేటగిరీల నుంచి అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు పోటీచేసి గెలుపొందిన వారు ఎస్టీలు కాదని అనేక సందర్భాల్లో రుజువైంది. ప్రస్తుతం అరకు ఎంపీ కొత్తపల్లి గీత సైతం ఎస్టీ కాదని హైకోర్టులో కేసు నమోదైన విషయం విధితమే. ఇదిలాఉండగా గీత సోదరుడు వివేకానందకుమార్ ఎస్టీ కాదని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ తేల్చడంతో త్వరలో ఎంపిపై వేటుపడనుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో రిజర్వుడు కేటగిరీ నుంచి ఎంపికైన ఆమె భవితవ్యం ఏమిటన్నది ప్రశ్నార్ధకంగా మారింది. పార్లమెంట్ సమావేశాల దృష్ట్యా విచారణకు హాజరుకాకపోవడంతో ప్రస్తుతం పెండింగ్‌లో ఉంచినట్లు తెలుస్తోంది. గతంలో ఉత్తరాంధ్రలోని రిజర్వుడు కేటగిరీల నుంచి అసెంబ్లీ స్థానాలకు పోటీచేసి గెలుపొందిన ప్రజాప్రతినిధులు గిరిజనేతరులని రుజువుకావడం తెలిసిందే.