ఆంధ్రప్రదేశ్‌

తెలంగాణ నీటి ప్రాజెక్టులతో గోదావరి డెల్టా ఎడారే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మార్చి 12: గోదావరి ఉపనదులపై తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు నిర్మించతలపెట్టిన ఐదు ప్రాజెక్టులు వల్ల గోదావరి డెల్టాకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని హైకోర్టు న్యాయవాదుల కమిటీ కన్వీనర్ డిఎన్‌ఎన్‌వి ప్రసాదబాబు, ఎపి ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వివిఆర్ కృష్ణంరాజు ఆందోళన వ్యక్తంచేసారు. శనివారం రాజమహేంద్రవరంలో విలేఖర్లతో వారు మాట్లాడుతూ మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాలు నిర్మించతలపెట్టిన ప్రాజెక్టులపై సాగునీటి రంగ నిపుణుడు ప్రొఫెసర్ పిఎ రామకృష్ణంరాజు, పర్యావరణవేత్త డాక్టర్ డి శ్రీనివాసరావుతో కలిసి తాము అధ్యయనం చేసామన్నారు. ఈ ప్రాజెక్టుల వల్ల భవిష్యత్తులో జనవరి-ఏప్రిల్ నెలల్లో గోదావరి డెల్టాకు నీటి లభ్యత ఉండదని హెచ్చరించారు. తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఈనెల 8న రాజుపేట, పింప్రాడ్, చనాకొ, తుమ్మిడిహట్టి, కాళేశ్వరం(మేడిగడ్డ) వద్ద రిజర్వాయర్లు నిర్మించేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయని ప్రసాదబాబు చెప్పారు. తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర జలసంఘం నిబంధనలను, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని ఉల్లంఘించటమే కాకుండా, చట్టబద్ధంగా ఏర్పాటైన గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఒప్పందాలు కుదుర్చుకున్నాయన్నారు. ముందస్తు సమాచారం లేకుండా చేసుకున్న ఈ ఒప్పందాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన అభ్యంతరాలను ఇంత వరకు అధికారికంగా తెలియచేయకపోవటం శోచనీయమన్నారు. ఏటా 2వేల నుండి 4వేల టిఎంసిల నీరు సముద్రంలోకి వృథాగా పోతోందని, అందువల్ల ముందుగా మహారాష్ట్ర, తరువాత తెలంగాణ, చివరిగా ఆంధ్రప్రదేశ్ ఆ నీటిని వినియోగించుకోవచ్చని తాను ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెప్పానని ఈనెల 8న తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ బహిరంగంగానే ప్రకటించారన్నారు. ఈ ప్రాజెక్టు ఒప్పందాలపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముందే తెలిసినపుడు ఒప్పందాలను అడ్డుకునేందుకు ఎందుకు ప్రయత్నించలేదని ప్రసాదబాబు, కృష్ణంరాజు ప్రశ్నించారు. రాష్ట్ర విభజన కారణంగా ఇరిగేషన్ రంగంలో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందన్నారు. నాగార్జునసాగర్, శ్రీశైలం, పులిచింతల, తుంగభద్ర వంటి ప్రాజెక్టులు అంతరాష్ట్ర ప్రాజెక్టులని, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రకాశం బ్యారేజి, సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజిలు కేవలం నీటిని మళ్లించే ప్రాజెక్టులు మాత్రమేనన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా లేకుండా పోయిందన్నారు.