గాడ్‌పాదర్‌ @ 100

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘డిక్టేటర్’. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. అంజలి, సోనాల్ చౌహాన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా బాలయ్య కెరీర్‌లో 99వ చిత్రం. తెలుగు పరిశ్రమలో వంద సినిమాలు పూర్తిచేసిన హీరోల్లో ఎన్టీఆర్, అక్కినేని, కృష్ణ, చిరంజీవిల తరువాత ఈ లిస్టులోకి ఎంట్రీ ఇస్తున్నాడు బాలయ్య. ఆయన హీరోగా రూపొందే వందో చిత్రాన్ని అత్యంత భారీ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. సింహ, లెజెండ్ వంటి సంచలన విజయాలు అందించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుందట. ఈ చిత్రానికి ‘గాడ్‌ఫాదర్’ అనే టైటిల్‌ను కూడా అనుకుంటున్నారట. వచ్చే ఏడాది జూన్ 10న ఈ సినిమా ప్రారంభం కానుందట. ఆ రోజు బాలకృష్ణ బర్త్‌డే సందర్భంగా ప్రారంభిస్తారని తెలిసింది. ఇప్పటికే కథ విన్న బాలయ్య ఈ సినిమాకు ఓకె చెప్పినట్టు సమాచారం.