ఆంధ్రప్రదేశ్‌

వెనక్కి తగ్గని బంగారు వ్యాపారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12రోజులుగా దుకాణాలు బంద్ స్పందించని కేంద్ర ప్రభుత్వం
విజయవాడలో రోజుకు రూ.20కోట్ల లావాదేవీల స్తంభన

విజయవాడ, మార్చి 13: బంగారు ఆభరణాల దిగుమతిపై ఒక శాతం ఎక్సైజ్ పన్ను విధించడాన్ని నిరసిస్తూ అఖిల భారత బంగారు, వెండి వర్తకుల సంఘం ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్‌లో బంగారు వ్యాపారుల ఆందోళన కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా చేపట్టిన దుకాణాల బంద్ కార్యక్రమం శనివారం నాటికే 12వ రోజుకు చేరుకుంది. తమ ఆందోళనలో భాగంగా వ్యాపారులు ఆదివారం ఇక్కడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్(నాని), గోకరాజు గంగరాజును కలిశారు. కేంద్రంతో మాట్లాడి సమస్య పరిష్కారానికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కాగా, ఒక్క కృష్ణా జిల్లాలోనే చిన్నా, పెద్ద బంగారం దుకాణాలు 1500 వరకు వున్నాయి. విజయవాడ నగరంలోనే 500 వుండగా రాష్టవ్య్రాప్తంగా సుమారు 15వేల బంగారం దుకాణాలున్నాయి. దుకాణాల బంద్ వల్ల విజయవాడ నగరంలో రోజుకు రూ.20కోట్ల మేర వ్యాపార లావాదేవీలు పూర్తిగా స్తంభించిపోయాయి. విజయవాడలో వ్యాపారులు రోజుకో వినూత్న రీతిలో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం పూలు పంపిణీ చేయగా, శనివారం మిఠాయిలు పంచుతూ కేంద్ర ప్రభుత్వం తక్షణం తమకు తీపికబురు చెప్పాలంటూ నినాదాలు చేశారు. ఆదివారం ఇద్దరు పార్లమెంట్ సభ్యులను కలిసి సమస్యను వివరించారు. పరిష్కారానికి సహకరించాల్సిందిగా వారిని కోరారు. 6 కోట్ల రూపాయల వార్షిక టర్నోవర్ కలిగిన దుకాణాలన్నింటికీ ఒక శాతం ఎక్సైజ్ పన్ను విధించడంతో దాదాపు అన్ని దుకాణాలు ఈ పన్ను పరిధిలోకి రావటం వల్ల ఆందోళన విజయవంతంగా జరుగుతోంది. బంగారం బిస్కెట్ల దిగుమతిపై 10శాతం ఎక్సైజ్ పన్ను మొదటి నుంచీ అమల్లో వుంది. బంగారు ఆభరణాలపై ఒక శాతం వ్యాట్ అమల్లో వుండగా నరేంద్ర మోదీ ప్రభుత్వం తాజాగా ఒక శాతం ఎక్సైజ్ పన్ను విధించింది. బిజెపి నేడు అధికారంలో వుండి గతంలో తాము వ్యతిరేకించిన పన్నును తిరిగి విధించడాన్ని బంగారు వ్యాపారులు నిరసిస్తున్నారు. 1962 నుండి గోల్డ్ కంట్రోల్ యాక్ట్ అమల్లో వుండగా 1989లో విపి సింగ్ ప్రభుత్వం ఆ చట్టాన్ని సవరించింది.