రాష్ట్రీయం

వేదవాటిక..ఎర్రవల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాలుగోరోజూ వైభవంగా యాగం
అరుదెంచిన అతిరథ మహారథులు
మళ్లీ గవర్నర్ నరసింహన్ దంపతుల పూజలు

సంగారెడ్డి, డిసెంబర్ 26: వివిధ జిల్లాలు, పరిసర గ్రామాల నుంచి లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు చేస్తున్న ప్రదక్షిణ, చండీమాత నామస్మరణ మధ్య నాలుగవ రోజు అయుత చండీ మహాయాగం అంగరంగ వైభంగా కొనసాగింది. ఉదయం 9.30 గంటలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరావు దంపతులు యాగశాల ప్రవేశం చేసారు. ముందుగా మహా సరస్వతి, మహాకాళి, మహాలక్ష్మీ విగ్రహాల వద్ద గురు ప్రార్థన చేసారు.
అతిథులతో కళకళాడిన యాగశాల
యాగం ఆరంభ కార్యక్రమానికి వచ్చిన గవర్నర్ నరసింహన్ నాలుగవ రోజు కూడా ఉదయమే సతీసమేతగా యాగశాలకు చేరుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు పూజల్లో నరసింహాన్ దంపతులు, యాగశాల చుట్టూ సిఎంతో పాటుగా ప్రదక్షిణలు చేసారు. పలువురు అధికార ప్రముఖులు, రాజకీయ నాయకులు, సినీ తారలు వచ్చారు. తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్‌వి.రమణ, మాజీ న్యాయమూర్తి సుదర్శన్‌రెడ్డి, తమిళనాడు హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుబాషణ్‌రెడ్డి, మాజీ న్యాయమూర్తులు స్వరూప్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తులు నవీన్‌రావు, రాజశేఖరరెడ్డి, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్, టిటిడి జెఇఓ శ్రీనివాస రాజు, రాజ్యసభ సభ్యులు సుబ్బరామిరెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డి, దానం నాగేందర్, ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్‌విఎస్ ప్రభాకర్, సినీ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్, శివాజీరాజా, మిమిక్రి శివారెడ్డి, తదితరులు హాజరయ్యారు. పుష్పగిరి పీఠాధిపతి, హలిదీపురం పీఠాధిపతి, గోపాల కృష్ణ మఠ పీఠాధిపతి మాదవినంద స్వామి, కపిలేశ్వర స్వామి, కమలానంద భారతి, మాధవానంద సరస్వతి స్వాములు కెసిఆర్ దంపతులను ఆశీర్వదించారు. జస్టిస్ రమణ పండ్ల బుట్టలతో వచ్చి చండీ రూపాలకు సమర్పించారు. టిటిడి తరపును జెఇఓ శ్రీనివాసరాజు ముఖ్యమంత్రికి స్వామి వారి ప్రసాదాన్ని అందజేసారు. మఠాధిపతులకు పండ్లు, వస్త్రాలను ముఖ్యమంత్రి అందించి పాదభివందనం చేసారు.
కెసిఆర్‌కు వస్త్రాలు పంపిన భారతీ తీర్థ
యాగంలోచివరి రోజైన ఆదివారం కెసిఆర్ ధరించనున్న పట్టు వస్త్రాలను శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీ భారతీ తీర్థ స్వామి ప్రత్యేక దూత ద్వారా పంపించారు. సిఎంకు ఆశీర్వచనంతో పాటు ఈ పట్టు వస్త్రాలను పంపించారు.
వేద పండితుడికి దంపతి పూజ
వేద విద్యావికాసానికి ఆరు దశాబ్దాలుగా అవిశ్రాంతంగా కొనసాగిస్తున్న కార్యదీక్షకు గుర్తింపుగా రంగారెడ్డి జిల్లా మర్పల్లి మండలం పట్లూర్ గ్రామానికి చెందిన మాడుగుల మాణిక్య సోమయాజులు దంపతులకు ముఖ్యమంత్రి దంపతి పూజ, ప్రత్యేక సన్మానం చేసారు. స్వర్ణ కంకణం తొడిగి ఘనంగా సత్కరించారు.
** గవర్నర్ నరసింహన్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతున్న వేద పండితులు**