రాష్ట్రీయం

విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసిన దారుణం

ఈపూరు, నవంబర్ 30: గుంటూరు జిల్లా ఈపూరు మండలంలో ఓ విద్యార్థిని సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ దారుణ ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. బాలికకు మాయమాటలు చెప్పి అడవిలోకి తీసుకెళ్లిన ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు, బాలిక బంధువుల కథనం ప్రకారం.. మండలంలోని కొండ్రముట్లపాలేనికి చెందిన బాలిక వినుకొండలో తొమ్మిదో తరగతి చదువుతోంది. రోజూ మాదిరిగానే ఈ నెల 25న స్కూలుకు వెళ్లింది. తిరుగు ప్రయాణంలో కొండ్రముట్లపాలెం వద్ద బస్సు దిగి ఇంటికి వెళుతోంది. అదే సమయంలో గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన రొక్కరోకల సతీశ్ అనే యువకుడు బైక్‌పై అటుగా వచ్చాడు. పుస్తకాలు కొనిపెడతానని నమ్మించి బాలికను బైక్‌పై ఎక్కించుకున్నాడు. కొండ్రముట్లపాలెంలో ఆగకుండా కొచ్చర్ల సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లాడు. అక్కడి నుండి రొక్కంరోకల గోపి, బీసపోగు మరియబాబు అనే యువకులను పిలిపించాడు. ముగ్గురూ కలిసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఇంటి వద్ద వదిలిపెట్టి వెళ్లిపోయారు. బాలిక పరిస్థితిని గమనించిన సోదరి విషయం తెలుసుకుని గుంటూరులో ఉన్న తమ తల్లిదండ్రులకు సమాచారం అందించింది. వారు ఆదివారం ఈపూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై నరసరావుపేట డిఎస్పీ కె నాగేశ్వరరావు సోమవారం విచారణ జరిపారు. బాలికను, తల్లిదండ్రులను విచారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆయన తెలిపారు. కాగా, ఈ కేసులోని నిందితులు ఇద్దరు పోలీసుల అదుపులో ఉండగా, మరో యువకుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

(చిత్రం) సామూహిక అత్యాచారం కేసు వివరాలు వెల్లడిస్తున్న డిఎస్పీ నాగేశ్వరరావు. పక్కన సిఐ, ఎస్‌ఐ