హాలీవుడ్ దీపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీపికా పదుకొనె ప్రస్తుతం బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వుంది. సహచర తారలందర్నీ వెనక్కి నెట్టి ఆమె టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇటీవల ఉత్తమ నటిగా కూడా అవార్డు అందుకుంది. ఆమె చేస్తున్నవన్నీ భారీ చిత్రాలే కావడం మరో విశేషం. ప్రస్తుతం బాలీవుడ్‌లోనే కాక హాలీవుడ్‌లో తన పతాకాన్ని ఎగురవేస్తోంది. ఆమె త్రిబుల్‌ఎక్స్ అనే హాలీవుడ్ చిత్రంలో విన్ డీజిల్‌తో కథానాయికగా నటిస్తోంది. ఇది నిర్మాణంలో వుండగానే హాలీవుడ్‌లో మరో అవకాశాన్ని చేజిక్కించుకుంది. బ్రాడ్‌పీట్ కథానాయకుడుగా రూపొందించనున్న మరో చిత్రంలో కూడా కథానాయికగా ఎంపికైంది. దీంతో బాలీవుడ్‌లో అందరికీ గుబులు పుట్టుకుంది. ఇక దీపిక హిందీ
చిత్రాల్లో నటించదా? హాలీవుడ్‌కే పరిమితం కానున్నదా? అని లెక్కలు వేస్తున్నారు బాలీవుడ్ పండితులు. ఏమో గుర్రం ఎగరాను వచ్చు! దీపిక హాలీవుడ్‌లోనే
సెటిల్ అవుతుందేమో..?